రాష్ట్రీయం

వచ్చే ఏడాది బడ్జెట్ 1.75 లక్షల కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.56 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించటం తెలిసిందే. ఈసారి అదనంగా 20వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలు తయారు చేయనున్నారు. అయితే వాస్తవ బడ్జెట్ స్వరూపం ఖరారు అయ్యేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాలని భావిస్తూ వివిధ శాఖల ఆదాయం, ఖర్చులపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా, అదనపు నిధులు కోరుతున్న కొన్ని శాఖల పనితీరుపై ఆరా తీస్తోంది. సంక్షేమ శాఖల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు ఇప్పటికే గుర్తించింది. వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఆహ్వానించింది. జిల్లా స్థాయిలో కూడా ప్రతిపాదనలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని భావిస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో జీతాల వ్యయం 2వేల కోట్ల రూపాయల మేర తగ్గవచ్చని అంచనా వేస్తోంది. ఎక్కువ మంది పదవీ విరమణ చేయనుండటమే ఇందుకు కారణం. దీంతో
జీతాల పద్దు కింద రూ. 36,290 కోట్లే ఖర్చవుతుందని అంచనా. రుణాల చెల్లింపులకు రూ. 18,240 కోట్లు కేటాయించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వడ్డీ చెల్లింపుల కోసం రూ. 16,416 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో అప్పులు చేయడం అనివార్యంగా మారింది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతుండటంతో ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు 35వేల కోట్ల రూపాయల వరకూ అప్పులు, వడ్డీల కింద చెల్లించాలన్సి ఉంటుంది. అయితే వివిధ శాఖల నుంచి ఇంకా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో బడ్జెట్ స్వరూపం కొలిక్కి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. మంత్రులతో ఇప్పటికే బడ్జెట్‌పై చర్చలు పూర్తికావాల్సి ఉంది. జనవరిలో మంత్రులతో చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.