రాష్ట్రీయం

మందుకు మందేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 17: మద్యానికి బానిసైనవారి కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఆసుపత్రి పెట్టి డీ అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఇస్తామని రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తాగునీరు దొరకని ప్రాంతాలెన్నో ఉన్నాయని, గ్రామాల్లో మరింత దుర్భరమైన పరిస్థితులున్నాయని, అయితే మద్యం దొరకని ఊరంటూ లేదని, ఒక్క ఫోన్ చేస్తే చాలు మద్యం ఇంటికే వచ్చేస్తోందన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాలన మొదలైన తక్షణం బెల్టుషాపులను రద్దు చేస్తామన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 37వ రోజైన ఆదివారం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం ధర్మవరం మండలం రావులచెరువు, బత్తలపల్లి గ్రామాల్లో మహిళలు, వృద్ధులు జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, పింఛన్లు రావడం లేదని, అధికార పార్టీ వారికే సంక్షేమ పథకాలు ఇస్తూ, ప్రతిపక్షాలకు చెందిన వారమన్న కారణంతో వేధింపులుకు గురి చేస్తున్నారని గోడు వెల్లబోసుకున్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి వేధిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కష్టాలకు తోడు మద్యం
విచ్చలవిడిగా దొరుకుతోందని, దీంతో కష్టార్జితం అంతా మగవాళ్లు తాగుడుకే తగలేస్తున్నారని తమ బాధలు ఏకరవు పెట్టారు. ఉద్యోగాలపై ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని ఓ ఆశా వర్కర్ వాపోయారు. దీంతో జగన్ స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు విశ్వసనీయత, మానవత్వం లేవని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. బిడ్డనిచ్చిన మామనే మోసం చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలను మోసగించడం కష్టేమేమీ కాదని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని 2014 ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఖనాజా నింపుకోవాలన్న సాకుతో గ్రామ స్థాయి వరకూ మద్యాన్ని ఏరులై పారిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అడిగితే తాగునీళ్లు రావని, కానీ ఒక్క ఫోన్ కొడితే ఇంటికే మద్యం డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఒక ఏడాది ఓపిక పట్టండి.. మనం అధికారంలోకి వస్తాం.. మనందరి కష్టాలు తీరుస్తాం.. అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటాం అన్నారు. అలాగే కుటుంబాల్లో ఆప్యాయతలు, అనుగారాలను పెంచుతాం.. అవి ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడు ఆ కుటుంబాల్లోని మగవారు మద్యానికి దూరమవుతారు..’’ అని జగన్ భరోసా ఇచ్చారు. దశల వారీగా మద్యాన్ని నిషేధించడంతో పాటు మద్యపానం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. 2024 నాటికి సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించి అప్పుడు జరిగే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తానని తెలిపారు.

చిత్రం..రావులచెరువు గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్