రాష్ట్రీయం

ఉరిశిక్ష ఖరారై నేటితో ఏడాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించి నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది డిసెంబర్ 19న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో 21 ఫిబ్రవరి 2013లో జరిగిన బాంబు దాడిలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు రెండు సైకిళ్లకు ఎల్‌ఈడీలు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు.
ఈ కేసులో ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన యాసిన్ భత్కల్ (పాకిస్తాన్) సహా జియా-ఉర్-రహమాన్, అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు దోషులుగా ప్రకటించింది. మూడున్నరేళ్లు పాటు సాగిన విచారణ అనంతరం కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష ఖరాలు చేసింది. కాగా నిందితులకు శిక్ష పడి ఏడాది పూర్తయినప్పటికీ శిక్ష అమలు కాలేదు. అయితే నిందితులపై దేశంలోని పలు కోర్టుల్లో కేసులు ఉండడంతో నిందితులు విచారణ ఎదుర్కొంటున్నారు. జంటపేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు ఆరుగురిని దోషులుగా గుర్తించింది. అయితే వీరిలో ఒకరు యాసిన్ భత్కల్ సోదరుడు రియాజ్ భత్కల్ పోలీసులకు చిక్కలేదు. పరారీలో ఉన్న రియాజ్ పాకిస్తాన్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
పేలుళ్లకు పాల్పడిన నిందితులు యాసిన్ భత్కల్‌పై సరూర్‌నగర్‌లో కేసు నమోదు కాగా, ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఆగస్టు 2013లో బీహార్‌లో అతణ్ని అరెస్టు చేశారు. జియా-ఉర్-రహమాన్‌ను 2014లో ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. ఎజాజ్ షేక్ ఉత్తర్‌ప్రదేశ్‌లో సెప్టెంబర్ 5న పోలీసులు అరెస్టు చేసి వీరిపై కేసులు నమోదు చేశారు. 201 ఆధారాలతో 158 సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.