రాష్ట్రీయం

రాజన్న రాజ్యం తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, డిసెంబర్ 18: రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెచ్చి ప్రజలను కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్ర 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో కొనసాగింది. నడిమిగడ్డపల్లి క్రాస్‌నుంచి బిల్వంపల్లి, నేలకోటతండా, నేలకోట గ్రామాల్లో మహిళలు జగన్‌ను చుట్టుముట్టి సమస్యలు విన్నవించారు. వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోందన్నారు. చంద్రబాబులా ఇచ్చిన హామీలు తప్పనన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ కష్టాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు వడ్డీలేని రుణాలు రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. అలాగే రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని, ఇస్తామన్న రూ.10 వేలు కూడా ఎవరికిచ్చారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఏడాది ఓపిక పట్టండి, ఎన్నికల అనంతరం మన ప్రభుత్వం వస్తుంది. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అమలుచేసిన ప్రతి పథకం అమలుచేస్తామన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా పిల్లలను ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందన్నారు. చదువుకునే రోజుల్లో ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇస్తుందని తెలిపారు. అలాగే పొదుపు సంఘాలకు ఎంత అప్పు వున్నా నాలుగు దఫాలుగా మహిళల చేతికే నగదు అందిస్తామన్నారు. వీటికి తోడు మద్యం వాసనే గ్రామాల్లో లేకుండా చేస్తానన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ అందిస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు అవుతున్నా కట్టిన ఇళ్లకే బిల్లులు చెల్లించలేదని మహిళలు చెబుతున్నారన్నారు. ఇక కొత్త ఇళ్లు ఎక్కడా కట్టించిన దాఖలాలు లేవన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. నవరత్నాల్లో పేర్కొన్న ప్రతి పథకం అమలుచేస్తామన్నారు. అంతకంటే మెరుగ్గా ఉపయోగంగా ఉండే పథకాలు తీసుకొచ్చేందుకే పాదయాత్ర చేస్తూ మీ ముందుకు వచ్చానన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు, మహిళలను కోరారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావాలని పూజలు చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్టవ్య్రాప్తంగా ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఒక్క పైసా విద్యుత్ బిల్లు చెల్లించే పనిలేకుండా ఉచితంగా కరెంట్ అందిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి నేలకోటతండాలో హామీ ఇచ్చారు. 2004కు మునుపు పాదయాత్ర చేపట్టిన రాజశేఖరరెడ్డి రైతుల కష్టాలు తెలుసుకుని రాష్టవ్య్రాప్తంగా ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. అప్పట్లో రైతాంగం ఎంతో ప్రయోజనం పొందిందన్నారు.

చిత్రం..ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు, మహిళలతో మాట్లాడుతున్న జగన్