రాష్ట్రీయం

తెలుగు తప్పనిసరి చేయడం చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి 12 వరకు తెలుగును తప్పని సరిచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిఎం కెసిఆర్ తెలుగు గురించి ఎంత ఆలోచిస్తున్నారో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతుందని అన్నారు. తెలుగు మహాసభలను ఇంత పెద్దఎత్తున నిర్వహించి తెలుగు భాషలు జేజేలు పలుకుతున్నందుకు సినీ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవితోపాటు బాలకృష్ణ, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు మంత్రి కెటిఆర్ వస్తే, తప్పకుండా వస్తానని చెప్పి ఆయన ప్రతిభకు వస్తున్న అవార్డులకు గాను ఆంగ్లంలో అభినందించానని చిరంజీవి చెప్పారు. వెంటనే కెటిఆర్ స్పందిస్తూ అన్నా.. తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు వస్తే ఆంగ్లంలో విష్ చేయడం ఎంతవరకు సబబు అని అన్నారని వేదికపై చిరంజీవి వెల్లడించారు. నా మనస్సు వెంటనే చివుక్కుమందని, సారీ కెటిఆర్ అని చెప్పగానే, ఆయన జస్ట్ జోక్ చేశానని అన్నారని చిరంజీవి చెప్పారు. అలాగే హీరో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారందరినీ ఒకేచోట చేర్చిన సహృదయత కెసిఆర్‌దని కొనియాడారు. ఆయన తెలుగు భాషాభిమానానికి యావత్తు ఆంధ్రా, తెలంగాణ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగు భాష ఎంతో రమణీయమైనదని అని ఆయన అన్నారు. తెలుగు భాషలో గోదావరి వంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణతనం, రాయలసీమ రాజసం, తెలంగాణ మాగాణం ఉన్నాయని అన్నారు. మనమందరం తెలుగువారిగా పుట్టినందుకు గర్వపడాలని చెప్పారు. ఈ మహాసభలకు బాలకృష్ణ పంచకట్టుతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో హీరో మోహన్‌బాబు వేదికపై ప్రసంగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పమంటూ ప్రతి ఒక్కరికీ జ్ఞాపకం చేస్తూ ఈ సభలను నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్‌కు ధన్వవాదాలు తెలిపారు. ప్రతి కళాకారుడిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, ఆహ్వానిస్తున్న కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ను మోహన్‌బాబు సన్మానించారు.
చిత్రం..తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్‌ను అభినందిస్తున్న మోహన్‌బాబు