రాష్ట్రీయం

ఉత్తమ లఘు చిత్రంగా ‘తంగేడు పూవులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా లఘు చిత్రాల కేటాగిరిలో మొదటి ఉత్తమ లఘు చిత్రంగా ‘తంగేడు పూవులు’ ఎంపికయ్యిందని, రెండవ ఉత్తమ లఘు చిత్రం అద్దిలు, మూడవ ఉత్తమ లఘు చిత్రంగా నది ఎంపికైనట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా లఘు చిత్రాల పోటీకి వచ్చిన ఎంట్రీలను చూస్తే రాష్ట్రంలో ప్రతిభ గల వారి వారు వందలు, వేల సంఖ్యలో ఉన్నారనే వాస్తవం అవగతమవుతున్నదని ఆయన తెలిపారు. అదేవిధంగా ఉత్తమ చలన చిత్రాల కేటగిరిలో ప్రథమ బహుమతికై ‘అనిదిగా’, రెండవ ఉత్తమ చిత్రంగా ‘నేను బతికే ఉన్నాను’, మూడవ ఉత్తమ చిత్రంగా ‘గావురం’ ఎంపికైనట్లు ఆయన వివరించారు. ప్రత్యేక ప్రశంసా చిత్రంగా ‘రేగడు’ ఎన్నికైందన్నారు. ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకుని సోమవారం రవీంద్ర భారతిలోని పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించిన యువ చిత్రోత్సవం ఎంపిక చేసిన లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లఘు చిత్రాల పోటీకి 173 ఎంట్రీలు రావడం చిత్ర రంగంపై యువతకు గల ప్రతిభకు అద్దం పడుతున్నదని అన్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న ఈ తరుణంలో మన సంగతేమిటని, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ప్రశ్నించే సమయంలో ప్రపంచ మహాసభలను నిర్వహించి తెలుగు ఉనికి కాపాడేందుకు ప్రయత్నించడం సముచితమని అన్నారు.

చిత్రం..యువ చిత్రోత్సవంలో పాల్గొన్న తలసాని