రాష్ట్రీయం

కాళేశ్వరంతో ముప్పులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి, రెండవ దశకు ఇప్పటికే అటవీశాఖ అనుమతి లభించగా అతి కీలకమైన పర్యావరణ అనుమతి కూడా సోమవారం లభించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని ప్రాజెక్టుల ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఇఎసి) సోమవారం స్పష్టం చేస్తూ పర్యావరణ అనుమతిని జారీ చేసింది. ఇది తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు. పర్యావరణ అనుమతిని కూడా సాధించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరో కీలకమైన మైలురాయిని దాటిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అనుమతులను వెంట వెంటనే సాధించడానికి కృషి చేసిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావును, అధికారులను అభినందించారు.