రాష్ట్రీయం

టీఎస్‌పీఎస్సీ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తన వందవ నోటిఫికేషన్‌ను సోమవారం నాడు విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, కార్యదర్శి ఎ వాణి ప్రసాద్‌లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చైర్మన్ సోమవారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడారు. ఇంత వరకూ పబ్లిక్ సర్వీసు కమిషన్ 98 నోటిఫికేషన్లను ఇచ్చిందని, మరో ఆరు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పారదర్శకత పాటించడంలో కమిషన్ దేశంలోనే నెంబర్‌వన్‌లో ఉందని అన్నారు. తాజా నోటిఫికేషన్లతో వంద నోటిఫికేషన్లు విడుదల చేసినట్టయిందని ఆయన చెప్పారు. ఉద్యోగ సమాచారం పేరుతో వెబ్ జర్నల్‌ను తీసుకువస్తున్నామని వెల్లడించారు.