రాష్ట్రీయం

భాషను సుసంపన్నం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: భాషను సుసంపన్నం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాడు తెలుగు యూనివర్శిటీ బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై జరిగిన తెలంగాణలో తెలుగు - భాషా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు ఆచార్య ఎస్ లక్ష్మణ మూర్తి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా ఆచార్య ఆర్వీఎస్ సుందరం హాజరుకాగా ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యను ఘనంగా సత్కరించారు. తెలంగాణలో తెలుగు భాషా వైశిష్ట్యంపై డాక్టర్ కె ముత్యం, శ్రామిక గేయాలపై మాస్టార్‌జీ, బతుకమ్మపై బండారు సుజాత శేఖర్, నిఘంటు నిర్మాణంపై జాస్తి విష్ణు చైతన్య, భాష వర్తమాన స్థితిపై సామల రమేశ్‌బాబు మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ మన తల్లి భాషను బతికించుకోవడానికి ముందుగా మన ఇళ్లలో వారసత్వంగా వచ్చిన భాషనూ ముందు తరం వారికి అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచీకరణలో చాలా భాషలతో పాటు మన భాష కూడా నిరాదరణకు గురైందని అన్నారు. అయితే ఈ ప్రపంచాన్ని ప్రతిఘటించే ఉద్యమం కూడా జరుగుతోందని చెప్పారు. తెలుగుభాష నిరాదరణకు గురవుతున్నందుకు తాను ఆందోళన చెందుతున్నానని, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహాసభలు తెలుగు భాషకు మరింత ప్రొత్సాహం, ఉత్సాహం ఇస్తాయని అన్నారు. భాష, యాసపై ఉద్యమంలో కూడా ప్రస్తావించామని పేర్కొన్నారు. అయితే ఒక భాషపై ఇంకో భాష ఆధిపత్యం చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు.