రాష్ట్రీయం

ఆహార కల్తీని అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆహారంలో కల్తీని అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వచ్చే నెల జనవరి 23వ తేదీలోగా తమకు సమర్పించాలని హైకోర్టు మంగళవారం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ప్రభుత్వ కార్యదర్శులను ఆదేశించింది. పండ్లను మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను పండ్ల వర్తకులు ఉపయోగిస్తున్నారనే అంశంపై వచ్చిన వార్తాపత్రికల నివేదికలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జిశ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అధికారులు నిర్లక్ష్యం వల్ల కృత్రిమ రసాయనాల ద్వారా పండ్లను మగ్గపెడుతున్నారని హైకోర్టు పేర్కొంది. వర్తకులు లాభం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నారని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆహార పదార్ధాల కల్తీ వల్ల ఏమి తినాలి, ఏమి తినకూడదనే ఆందోళన, భయంతో ప్రజలు ఉన్నారని హైకోర్టు పేర్కొంది. నిపుణులతో చర్చించి, ఆహారంలో కల్తీని నిరోధించడానికి తీసుకున్న చర్యలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, తప్పిదాలకు పాల్పడిన వర్తకులపై తీసుకునే చర్యలపై కూడా చర్చించి
నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వండి
ఏపి, తెలంగాణలను ఆదేశించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి మాస్ కాపీయింగ్ నిరోధానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఏలూరుకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. 2017 పబ్లిక్ పరీక్షల్లో ఎంత మంది విద్యార్థులను మాల్ ప్రాక్టీసు కింద పట్టుకున్నారని, ఎంత మంది ప్రాసిక్యూట్ చేశారని, 1997 పబ్లిక్ పరీక్షల చట్టం కింద ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1200 సెంటర్లలో సిసిటివి కెమెరాలను అమర్చామన్నారు.