రాష్ట్రీయం

ఎమ్మెల్సీ ఉప పోరుకు మోగిన నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 19: కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నికకు నిర్వహిస్తున్న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మంగళవారం విడుదల చేశారు. దాంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన శిల్పా చక్రపాణిరెడ్డి ఆగస్టులో జరిగిన నంద్యాల శాసన సభ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో శాసనమండలి సభ్యుని ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1142 ఓట్లు ఉండగా ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించనందున 51 ఓట్లు, ఎంపీటీసీలుగా ఎన్నికైన వారిలో 16 మంది, జడ్పీటీసీలు ఇద్దరు మరణించారు. దీంతో ఎంపీటీసీలు 800 మంది, పురపాలక వార్డుసభ్యులు 222 మంది, జడ్పీటీసీలు 51 మంది కలిపి 1073 మంది స్థానిక ప్రతినిధులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కలిపి మొత్తం 1080 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కర్నూలు నగర పాలకసంస్థను
ఎంచుకోడంతో అక్కడ పాలక మండలి లేని కారణంగా వారు శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు లేకుండా పోయింది. ఇక నంద్యాల శాసనసభ్యునిగా ఎన్నికైన భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల పురపాలక సంఘంలో సభ్యునిగా నియామకం కాకపోవడంతో ఆయన కూడా ఓటు వేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ. జనార్థన్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరాంల నియోజకవర్గాల్లో పురపాలక సంఘాలు లేని కారణంగా వారికి ఓటు వేసే అవకాశం లేదు. కాగా పురపాలక సంఘం ఉన్నప్పటికీ డోన్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఓటు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని వారు స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యత్వం కోసం పోటీ చేసే అభ్యర్థిని కనీసం 10 మంది స్థానిక ప్రతినిధులు బలపర్చాల్సి ఉండటంతో ఈ ఎన్నికల్లో స్వతంత్రులు పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సరైన బలం లేకపోవడంతో ఎన్నికల బరిలో కేవలం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా మాత్రమే పోటీ చేసే అవకాశముంది. కాగా ప్రస్తుత స్థానిక ప్రతినిధులు తమ పదవీకాలంలో మూడు దఫాలు శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడం ఒక రికార్డుగా అధికారులు, రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు.