రాష్ట్రీయం

ఆదిలాబాద్ గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 19: ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లా గజ గజ వణికిపోతోంది. గత నాలుగేళ్ళ రికార్డును బద్దలుకొడుతూ మంగళవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2014 డిసెంబర్ 20న ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆ తర్వాత ఈసారి రికార్డును బ్రేక్‌చేస్తూ 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని, మరో వారం రోజులు చలి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం నిపుణులు డాక్టర్ శ్రీధర్ చౌహన్ ‘ఆంధ్రభూమి’కి వివరించారు. దట్టమైన అడవులు, నల్లరేగడి భూములకు తోడు సముద్ర మట్టానికి 35 5మీటర్ల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తరించి ఉండడం వల్లే ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల వరకు ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. దీంతో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే జనం చలిపులిని చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, పాలు, కూరగాయలు విక్రయించే చిరు రైతులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో యాచకులు, వృద్దుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కిటికీలు, అద్దాలు లేక ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రకు దూరమై చలితో వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు, ఆసిఫాబాద్ కేంద్రాలు జనసంచారం లేక నిర్మానుషంగా మారగా వ్యాపారం కూడా కొనసాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. సోమవారం సాయంత్రం 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా వాతావరణ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో ఒకేసారి 3.8 డిగ్రీలకు చలి పడిపోయంది.