రాష్ట్రీయం

ఉర్రూతలూగించిన రెహమాన్ మ్యూజికల్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 21: సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ షో సంగీతాభిమానులను ఉర్రూతలూగించింది. కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో గురువారం రాత్రి రెహమాన్ బృందం ఆలపించిన సినీ గీతాలతో సాగర తీరం పులకించింది. అశేష జన వాహినితో బీచ్ జన సంద్రాన్ని తలపించింది. అత్యున్నత సాంకేతిక విలువలు, సౌండ్ సిస్టం, వెలుగు జిలుగుల మధ్య భారీ వేదికపై రెహమాన్ బృందం మ్యూజికల్ షో ప్రారంభించింది. అభిమానులు కరతాళ ధ్వనులతో ఆద్యంతం కార్యక్రమాన్ని వీక్షించారు. షో కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ అప్పటికే వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆయన రాక కోసం నిరీక్షించారు. కాకినాడ నగరంలోని జిఆర్‌టి గ్రాండ్ హోటల్‌లో బస చేసిన ఆయన అక్కడి నుండి నేరుగా బీచ్‌లోని వేదిక వద్దకు చేరుకున్నారు. తొలుత వేదికపై రహమాన్ సినీ ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం ఘర్ ఆజా అనే పాటతో రెహమాన్ సంగీత ఝరి ప్రారంభమయ్యింది. చిన్ని చిన్ని ఆశ, ఓ చెలియా నాప్రియ సఖియా, కదిలే దేవత అమ్మా, ఉరికే చిలుకా వంటి తెలుగు, తమిళ, హిందీ పాటలను గాయనీ గాయకులు ఆలపిస్తుండగా రహమాన్ వేదికపై నుండి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరించారు.
బీచ్ ఫెస్టివల్ విజయవంతం
మూడు రోజులుగా నిర్వహించిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ విజయవంతమయ్యింది. గురువారం రాత్రితో సాగర సంబరాలు ఘనంగా ముగిశాయి.