రాష్ట్రీయం

ఇక విజయవాడలోనే నియామకాల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: వచ్చే ఏడాది జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విజయవాడ కేంద్రంగా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. ఇక్కడి బందరు రోడ్డులోని ఆర్ అండ్ బి నూతన భవన సముదాయంలో కమిషన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు హైదరాబాదు నుండే కమిషన్ కార్యక్రమాలు కొనసాగాయని తెలిపారు. నవరి మొదటి, రెండవ వారాలలో గ్రూప్-2 ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన కమిషన్ నూతన కార్యాలయంలో జరుగుతుందన్నారు. 2011 నాటి గ్రూప్-1 పోస్టులకు జనవరి 22 నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. త్వరలో గ్రూప్-3లో 1,055 పోస్టుల ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. గత మూడేళ్లలో 34 నోటిఫికేషన్లు జారీ చేశామని, వీటిలో 3 తప్ప మిగతా నోటిఫికేషన్‌లకు నియామకాలు జరిగినట్లు ఉదయ్‌భాస్కర్ తెలిపారు. కోర్టు కేసుల వల్ల నియామకాల ప్రక్రియ ఆలస్యమైందన్నారు. గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు అభ్యర్థుల నుండి ఆప్షన్ తీసుకుని వచ్చే సంవత్సరం నుంచి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్‌లు జారీ చేస్తామన్నారు. కాగా, డిఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అన్న అంశంపై ప్రాథమికంగా చర్చించామన్నారు. గ్రూప్-2లో మార్కులు ఎక్కువ వచ్చినా, జాబితాలో పేరు లేనివారు తమ వివరాలను కమిషన్‌కు తెలియచేయాలని కోరారు. కేటగిరిల వారీగా ఖాళీల జాబితా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనివల్ల ఒక పోస్టుకు 50 మంది బదులు 150 మందికి పరీక్ష నిర్వహించే వీలు కలుగుతుందన్నారు. గ్రూపు-2కు 6 లక్షల మంది దరఖాస్తు చేయగా 41 వేల మందిని ఎంపిక చేశామన్నారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడానికి ఒక్కో అభ్యర్థికి 350 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. కమిషన్ సభ్యులు జి.సీతారామరాజు, జి.రంగా జనార్దన్, విజయ్‌కుమార్, జి.సుజాత, పద్మరాజు, శివరూప, కార్యదర్శి వైవిఎస్‌టి సాయి పాల్గొన్నారు.

చిత్రం..మీడియాతో ఎపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్