రాష్ట్రీయం

ధర్మ ప్రచారానికి కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: హిందూ ధర్మ ప్రచార వ్యాప్తికోసం రాష్ట్రంలోని హిందూ దేవాలయాలన్నింటా ధర్మ ప్రచార పరిషత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రాష్ట్రంలో టీటీడీ తర్వాత రెండో ప్రధాన దేవస్థానంగా దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ శ్రీకనకదుర్గా మల్లేశ్వరస్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఎంతో విశాలమైన కళావేదిక నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన శ్రీకనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్ ప్రథమ వార్షికోత్సవ సభలో మంత్రి మాణిక్యాలరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలందరికీ హైందవ ధర్మాన్ని తెలియచేయాలన్న సంకల్పంతో ఏడాది క్రితం ఏర్పాటైన ఈ సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండటం హర్షదాయకమని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ ధార్మిక, సామాజిక కార్యకలాపాలతో తమ దేవాలయం ముందుకు సాగుతున్నదని అన్నారు. హైందవ ధర్మాన్ని చాటిచెప్పాలనే లక్ష్యంతో శ్రీ కనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్‌తో పాటు శ్రీనారాయణతీర్థ ప్రాజెక్టును, శ్రీక్షేత్రయ్య ప్రాజెక్టును ఏర్పాటుచేసి కృష్ణాతీరంలో నారాయణ, శ్రీసిద్దేంద్రయోగిల విశిష్టతను చాటి చెబుతున్నారని అన్నారు. దుర్గగుడి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు ఈ సందర్భంగా ఏర్పాటైన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పరిషత్ డైరక్టర్ డాక్టర్ వేదాం తం రాజగోపాల చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో దుర్గగుడి పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో కొత్త ఏడాది వేడుకలకు చెక్
ఆంగ్లేయుల పాలనలో ప్రారంభమైన జనవరి 1 నూతన సంవత్సర వేడుకలను అన్ని ఆలయాల్లో నిషేధిస్తున్నట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి చిలకపాటి విజయ రాఘవాచార్యులు ప్రకటించారు. భారతీయ వైదిక విధానం ప్రకారం కేవలం ఉగాదే నూతన సంవత్సరంగా భావించాలని అంటూ, దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు దేవాదాయ కమిషనర్ సూచనలు జారీ చేశారన్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆంగ్లేయ సంప్రదాయాలను విడనాడాలన్నారు. కమిషనర్ సూచనలను అమలు పరచాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల కార్యనిర్వహణాధికార్లుకు, సహాయ కమిషనర్లకు, ఉపకమిషనర్లకు తెలిపామన్నారు.