రాష్ట్రీయం

రైతులు చరిత్రలో నిలిచిపోతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 24: ‘రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన విధానంపై రాష్టప్రతికి ప్రత్యేకంగా వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుకి స్పందించి తమ విలువైన భూములను స్వచ్ఛందంగా అందించారు. వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అమరావతి ప్రజల రాజధాని. రైతులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను. రాజధాని కోసం రైతులు ప్రాణప్రదంగా చూసుకునే భూములిచ్చారు. కేవలం ప్రభుత్వంపై నమ్మకంతో అన్నదాతలు చేసిన ఈ త్యాగాలను ఎన్నటికీ మరువబోం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘అమరావతిని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, హాయిగా జీవించగలిగే నగరంగా తీర్చిదిద్దుదాం. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో ప్రపంచ శ్రేణి రాజధాని నగరాన్ని నిర్మిస్తాను. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా కేస్ స్టడీగా తీసుకుంది. ఇది మనకెంతో గర్వకారణం’ అని ఆయనన్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెపుతూ, నవ్యాంధ్ర నూతన రాజధాని ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. పలు దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న రాష్టప్రతి విజయవాడ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్టప్రతికి అమరావతి చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా వివరించడంతో పాటు రాజధాని నగరాన్ని ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయబోతోందనే విషయాన్ని కూడా తెలియజేయాలన్నారు. ప్రపంచంలోనే 10 అద్భుత రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలను, ప్రత్యేకించి ల్యాండ్ పూలింగ్ గురించి రాష్టప్రతికి తెలియజేయాలని సూచించారు. కృష్ణా తీరంలో నిర్మిస్తున్న రాజధాని నగరం గొప్పతనం, నేపథ్యంపై సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. అమరావతి వల్ల చేకూరే ఆర్థిక, అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం అందేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతి నగరం గురించి తెలుగువారంతా గొప్పగా చెప్పుకోవాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు వివరించారు. కాగా, రాష్టప్రతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలో రోడ్లు, భవనాలు, శాఖమూరు పార్క్, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు వంటి వౌలిక సదుపాయాల నమూనాలను ఉంచనున్నట్లు ఇంధన, ఐ అండ్ ఐ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పథకం (ఎల్‌పీఎస్) విజయవంతమైందని వివరించారు. ఎల్‌పీఎస్‌లో భాగంగా రైతులు సొంతంగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్లాట్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు 22,902 మంది రైతులకు 58,794 ప్లాట్లు అందజేసినట్లు వెల్లడించారు. ఎల్‌పీఎస్ పథకంలో జరీబు భూమి రైతులు ఎకరానికి రూ. 50వేలు, మెట్ట భూముల రైతులు ఎకరానికి రూ. 30వేల చొప్పున వార్షికాదాయం పొందుతారని, భూమిలేని కుటుంబాలకు నెలకు రూ. 2500 చొప్పున పదేళ్లపాటు పింఛను అందిస్తామని వివరించారు.
సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయిప్రసాద్, ప్రత్యేక కమిషనర్ రామ్‌మనోహర్‌రావు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ షణ్మోహన్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు.