రాష్ట్రీయం

ఇదీ అసలైన స్కిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ‘స్కిల్ డెవలప్‌మెంట్’ శిక్షణ, తదితర కార్యక్రమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, వంశపారంపర్యంగా లభిస్తున్న నైపుణ్య శిక్షణ రాష్ట్రంలో పదిలక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. అంటే పదిలక్షల కుటుంబాలు స్వయం ఉపాధిమీద జీవిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వంశపారంపర్య స్కిల్ డెవలప్‌మెంట్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన చౌరస్తాల్లో, రద్దీ ప్రదేశాల్లోని రోడ్లపక్కన చిన్న చిన్న వస్తువులను కొంత మంది విక్రయిస్తుంటారు. కోఠిలోని సిబిఐ కార్యాలయం ఎదుట దాదాపు 50కిపైగా కుటుంబాలు రోడ్డుపక్కనే చిన్న చిన్న వస్తువులు తయారుచేసి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇళ్ల దర్వాజాలకు కట్టే మామిడి ఆకురూపాల్లో ఉండే ప్లాస్టిక్ తోరణాలు, పూసలు, గాజుగొట్టాలతో ఉండే తోరణాలను, పిల్లలు ఆడుకునే వివిధ రూపాల్లో ఉండే ఆటవస్తువులను ఇక్కడ కొంతమంది పెద్దలు, పిల్లలు కలిసి తయారు చేస్తుంటారు. వీరంతా గిరిజన తెగలు, బలహీన వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఆలుమగలు కలిసి ప్రజలు వాడే ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తున్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపించకుండా, తాము చేసే వృత్తిపనిలోనే కొనసాగేలా శిక్షణ ఇస్తున్నారు. దాదాపు మూడు శతాబ్దాల నుండి ఈ కుటుంబాలు అలంకరణ వస్తువలను తయారు చేసే వస్తువుల తయారీ, అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పెద్దలైనా, పిల్లలైన రోజూ మూడు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు విలువైన వస్తువులను తయారు చేసి అమ్ముతుంటారు. అంటే ఒక కుటుంబంలో నాలుగురు సభ్యులుంటే దాదాపు 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. నెలకు సరాసరిన 30 వేల రూపాయల నుండి 60 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇదే విధంగా ఇళ్లల్లో ఉపయోగించే ఫర్నీచర్, పూలకుండీలు, అలంకరణ వస్తువులలతో పాటు ఇతరత్రా ఉపయోగించే చిన్న చిన్న వస్తువులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తయారు చేసి అమ్ముతున్నారు.
ఇదిలా ఉండగా సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు తదితర వాహనాల మరమ్మతుల్లో కూడా కొన్ని వర్గాలకు చెందిన వారు తమ పిల్లలకు చిన్నప్పటి నుండే శిక్షణ ఇప్పిస్తుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం తదితర కారణాల వల్ల పదేళ్ల లోపు పిల్లలే మరమ్మతుల పనుల్లో పెద్దవాళ్లకు సహకారం అందిస్తుంటారు. కాలక్రమంలో వీరే సుశిక్షితులైన నిపుణులుగా మారుతున్నారు. బిటెక్, బిఇ చదువుకున్న విద్యార్థులు కూడా చేయలేని మోటారు మరమ్మతులను ఏమీ చదువులేని వీరు చేస్తున్నారు. అంటే వీరికి మోటారు వాహనాల మరమ్మతు పనుల్లో ‘ప్రాక్టికల్ నాలెడ్జ్’, జీవించే నైపుణ్యం ఉంటోంది. వంశపారంపర్యంగా మెకానిక్‌లుగా మారుతున్న వారు నెలకు 50 వేల రూపాయలపైగా సంపాదిస్తున్నారు. పరుపులు తయారు చేయడం, కుర్చీలు, సోఫాలకు వైర్లు అల్లడం, ఫ్యాన్లు తదితర విద్యుత్
పరికరాల మరమ్మతుల్లో వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. కోఠి, మోజంజాహి మార్కెట్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా మరమ్మతు పనులు చేస్తున్న వారు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ విధంగా జీవించే వారు ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల కోసం ఏనాడూ వెళ్లడం లేదు. కొద్దిపెట్టుబడితో పనులను ప్రారంభించి, లక్షలాది రూపాయల టర్నోవర్ వరకు చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంగలి, చాకలి, కంసాలి, అవుసలి తదితర పనుల్లో రాణిస్తున్న వారంతా చిన్నప్పటి నుండి వృత్తిపనుల్లో శిక్షణ పొందుతున్నవారే.

చిత్రాలు..కింగ్ కోఠిలో టూ వీలర్ మరమ్మతు చేస్తున్న పిల్లలు అమీర్, జబ్బార్

*కోఠి సిబిఐ కార్యాలయం వద్ద తోరణాలను తయారు చేస్తున్న పిల్లలు లలిత, రవి