రాష్ట్రీయం

శ్రీవారి ప్రణయ కలహోత్సవం 3న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 24: నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో కొలువైన ఉత్సవాల దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయ కలహోత్సవం జనవరి 3వ తేదీన తిరుమలలో టీటీడీ నేత్రపర్వంగా నిర్వహించనుంది. ఆరోజు సాయంత్రం 4 గంటల తరువాత స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేర్వేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేర్వేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. అనంతరం అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం సాగుతుంది. ఈసందర్భంగా శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన వసంతోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
2న పౌర్ణమి గరుడ సేవ రద్దు
ప్రతి నెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడ సేవను జనవరి 2వ తేదీన టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.