రాష్ట్రీయం

తిరుమలలో పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 24: సంవత్సరాంతం, క్రిస్మస్, వారాంతపు సెలవులు రావడంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వదర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకు 61,705 మంది స్వామివారిని దర్శించుకున్నారు. మరో 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి లక్ష మందికి పైగా భక్తులు తిరుమలేశుని దర్శించుకునే అవకాశం ఉంది. ఓవైపు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో విపరీతమైన చలి ఉన్నా భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచివుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలాగే పెరిగిన చలితో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇక క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం వారికి అవసరమైన ఆహారం, నీరు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. సుమారు 25వేల మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి ఉంటారని అంచనా. శని, ఆదివారాలు సెలవుదినాలతో పాటు 25న క్రిస్మస్ సెలవుదినం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సంవత్సరాంతాన స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. రద్దీ కారణంగా తిరుమలలో వసతి కొరత ఏర్పడింది. దీంతో భక్తులు ఉద్యానవనాలు, పేవ్‌మెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అలసిన భక్తులు రోడ్లపక్కన ఆదమరచి నిద్రపోతున్న దృశ్యాలు ఎటుచూసినా కనిపిస్తున్నాయి. తిరుమలేశుని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 3 నుంచి 4 కోట్లు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భక్తుల రద్దీ పెరుగుతుందని ముందుగా ఊహించిన అధికారులు సిఫార్సు ఉత్తరాలకు ప్రాధాన్యత తీసివేయడంతో సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచే అవకాశం లభించింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..కిటకిటలాడుతున్న తిరుమల గిరులు