రాష్ట్రీయం

లక్ష లోగిళ్లకు ఇంటర్నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 25: దేశంలోనే తొలిసారిగా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలన్న విప్లవాత్మక ఆలోచన కార్యరూపం దాల్చనుంది. కేవలం రూ.149కే ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం అందించే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఈనెల 27న భారత రాష్టప్రతి కోవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ పథకంతో 55 గ్రామాల్లోని లక్ష ఇళ్లకు అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నిరంతర విద్యుత్ పథకం తర్వాత ప్రవేశపెడుతున్న మరో విప్లవాత్మక పథకం ఫైబర్‌నెట్. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ముచ్చటగా మూడు సేవలుగా అభివర్ణిస్తున్న ఈ పథకంలో ఒక కనెక్షన్ తీసుకుంటే గృహ వినియోగదారులకు 15 ఎంబీపీఎస్, వాణిజ్య అవసరాలకు 100 ఎంబీపీఎస్, 250 టీవీ ఛానెళ్లను ఆనందంగా వీక్షించే సదుపాయం, ఉచితంగా పరిమితి లేని ఫోన్‌కాల్స్ సేవలు లభిస్తాయి. ఈ శతాబ్దంలోనే ఒక అద్భుత సాంకేతిక విప్లవంగా నిపుణులు దీన్ని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఈ పథకానికి బీజం వేశారు. ఫైబర్ నెట్ ద్వారా నేడు రాష్ట్రంలో 20వేల నిఘా కెమేరాలు, జిల్లాల్లో 16 సమీకృత కమాండ్ కంట్రోల్ సమాచార కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆకర్షణీయ గ్రామాలను మొబైల్ టవర్లకు అనుసంధానించడం ద్వారా శక్తిమంతంగా తీర్చిదిద్దారు. నాలుగువేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో మేటిగా తయారుకావడానికి ఫైబర్ నెట్ తోడ్పడుతోంది. టెలీకాన్పరెన్స్‌లో సీఎం చంద్రబాబు సూచనలకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ ఎ బాబు స్పందిస్తూ ఫైబర్ నెట్ టెక్నాలజీతో రాష్ట్రంలో 4678 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన డిజిటల్/ మల్టీ మీడియా క్లౌడ్ బేస్డ్ వర్చువల్ క్లాస్ రూములు నెలకొల్పాల్సి ఉందని ప్రతిపాదించారు. విద్యార్థుల్లో నేర్చుకునే నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ తరహా క్లాస్‌రూములు దోహదం చేస్తాయన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఇంధనశాఖ, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరక్టర్ ఎ.బాబు, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ టెక్నికల్ డైరక్టర్ అట్లూరి రామారావు పాల్గొన్నారు.
సిటిజన్ -నెటిజన్
కేవలం నెలకు రూ.149కే టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం (డేటా, వాయిస్, వీడియో సేవలు) సమకూరను న్నాయ. ఫైబర్‌నెట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్న చంద్రబాబు దార్శనికతకు ఈ ప్రాజెక్టు అద్దంపడు తుంది. విద్యుత్ స్తంభాలు ఆసరాగా ఫైబర్ గ్రిడ్ పథకం రూపుదిద్దుకుంది. భూగర్భ కేబుల్స్‌తో రూ.5వేల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టును, కరెంటు స్తంభాల ఆధారంగా డిజైన్‌చేసి కేవలం రూ.400 కోట్ల వ్యయంతోనే రూపకల్పన చేశారు. హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ వౌలిక సదుపాయంతో ఆంధ్రలో అన్ని పట్టణాలు, మారుమూల గ్రామాలు సైతం ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతాయి. గృహ వినియోగదారులే కాకుండా వ్యాపా ర, వాణిజ్య వర్గాల వారి అవసరాలకూ ఫైబర్ నెట్ సేవలు అందుతాయ. రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల ఖరీదైన సెట్ టాప్ బాక్సును నెలకు రూ.99 వంతున చెల్లించి
కొనుగోలు చేసే అవకాశం కల్పించిందని ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు 24 గంటల వైఫై సేవలు పొందవచ్చు. టీవీని కంప్యూటర్‌గానూ ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఫైబర్ నెట్ ద్వారా వినియోగదారుడు తన మొబైల్ ఫోన్‌నే రిమోట్‌గా ఉపయోగించుకోవచ్చు. వీడియోకాల్ చేసుకునే సదుపాయం ఉంది. కనీస ప్యాకేజీ కింద నెలకు రూ.149 చెల్లిస్తే 5 జీబీ ఉపయోగించుకునేలా, 15 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన సేవలు అందుతాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో రూ.399 చెల్లిస్తే 25 జీబీ దాకా ఉపయోగించుకోవచ్చు. అలాగే 50 జీబీ ఉపయోగించుకునే ప్రీమియం ప్యాకేజీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రజల ముందుకు తెస్తోంది. ఏ ప్యాకేజీ తీసుకున్నా 250 టీవీ ఛానెళ్లను చూడవచ్చు.
చిత్రం..పైలెట్ ప్రాజెక్టుగా మోరిలో ఫైబర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో చంద్రబాబు