రాష్ట్రీయం

కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 25: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిపై గత వారం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీడీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడయిన కేఈ ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ఖరారు చేశారు. దానిపై గత వారం రోజుల నుంచి సీటు ఆశిస్తున్న నేతలతో పార్టీ సీనియర్లు చర్చలు జరిపారు. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు అభ్యర్థిత్వంపై సీనియర్లతో బాబు మాట్లాడారు. కేఈ, చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డి, గంగుల పేర్లపై పరిశీలన జరిగింది. అప్పుడు కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో సాయంత్రం మరోసారి చర్చించారు. చివరకు కేఈ వైపు మొగ్గు చూపారు. బీసీ వర్గానికి సీటు ఇవ్వడం ద్వారా, కర్నూలులో మూడు సామాజికవర్గాలను సమన్వయం చేశారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డికి, ఆ సీటు ఆశించిన శ్రీ్ధర్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదే సమయంలో ముస్లిం వర్గానికి చెందిన ఫరూక్‌కు మండలి చైర్మన్, అదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్ నౌమాన్‌కు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చి రెడ్డి, ముస్లిం వర్గాలను మెప్పించారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలో బీసీ వర్గానికి పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చేరవయ్యారు. కేఈ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు సీఎం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడిన చల్లా రామకృష్ణారెడ్డి తాను కూడా సీటు ఆశిస్తున్నానని, అయితే ఎవరికి
ఇచ్చినా అభ్యర్థిని గెలిపిస్తామని, సీఎం ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ఇదిలాఉండగా, వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. తొలుత పోటీ పెట్టాలని భావించినప్పటికీ, టీడీపీకి 270 ఓట్లు అధికంగా ఉండటం, క్యాంపులతో పాటు, కొనుగోలు చేసేంత ఆర్థికస్థోమత ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మళ్లీ ఓడిపోతే కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్న ముందుచూపు కూడా లేకపోలేదని చెబుతున్నారు.