రాష్ట్రీయం

మూడేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) రాష్ట్రంలోని యువతకు మరో వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే కొన్నివేల మంది నిరుద్యోగుల కు ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా వచ్చే మూడేళ్లలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా లక్ష మందికి నైపుణ్య శిక్షణ కల్పించడానికి సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్‌కు చెందిన డాస్సాల్ట్ సిస్టమ్స్‌తో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో డాస్సాల్ట్ సిస్టమ్స్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్యామ్‌సన్ ఖాన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో కోగంటి సాంబశివరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని డాస్సాల్ట్ సిస్టమ్స్ ఎండీ శ్యామ్సన్ అన్నారు. ఆధునిక సాంకేతికతను రాష్ట్ర విద్యార్థులకు అందించడంలో తామూ భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. డాస్సాల్ట్ సిస్టమ్స్ సంస్థ ద్వారా 85 కోర్సుల్లో యువతకు ప్రపంచస్థాయి శిక్షణ అందుబాటులో కి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాం టి శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగుల్లో మరింత నైపుణ్యం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని అన్నారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులను ఎంపిక చేసి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు డాస్సాల్ట్ సిస్టమ్స్‌కు ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకరిస్తుందని సంస్థ ఎండీ, సీఈవో కోగంటి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ 5వేల చదరపు అడుగుల స్థలాన్ని డాస్సాల్ట్ సంస్థకు కేటాయించనుందని తెలిపారు. ఇందులో పరిశోధన స్టార్టప్, ఇన్నోవేషన్ సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనిద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అవకాశాలు పెరుగుతాయని సాంబశివరావు అన్నారు.