రాష్ట్రీయం

మద్యం ధరలకు కిక్కే కిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణలో మద్యం ధరలు పెంచారు. దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్) రిటైల్ బ్రాండ్లపై పదిశాతం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. డిసెంబర్ 31 సమీపిస్తుండడంతో మద్యం విక్రయాలు పెరిగాయి. దీంతో ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలులోకి వస్తాయి. డిసెంబర్ 26 వరకు ఇప్పటికే షాపులకు చేరిన మద్యం, 27 నుంచి విక్రయించే ధరల మధ్య వ్యత్యాసం లేకుండా ఏకరీతిన ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ మద్యం ధరలను పెంచింది.