రాష్ట్రీయం

భగ్గుమన్న గుడిసెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమీపంలోని భాస్కరరావుపేటలో బుధవారం ఉదయం 11 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 150 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయ. ప్రమాదంలో వృద్ధురాలు సజీవదహనమైంది. వందలాది పేదలు నిరాశ్రయులై వీధినపడ్డారు. అగ్నికీలలు చెలరేగి మంటలు దావానంలా ఎగిసిపడ్డాయి. ఇళ్లలోని వస్తువులు, మంచాలు, వంటసామగ్రి, చివరకు భద్రంగా దాచుకున్న నగదు, వెండి, బంగారు ఆభరణాలు బూడిదపాలయ్యాయి. నివాసితులు రోజువారీ కూలీలుగా యాచకులుగా, పూసలు విక్రయాలపై జీవన పోరాటం సాగించడానికి ఎప్పటిలా ఉదయానే్న ఇళ్లు విడిచి నగరంలోకి వెళ్లినపుడు దుర్ఘటన జరిగింది. పార్కు పక్కనే ఉన్న ఇంట్లో వంట చేస్తుండగా రేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీనికి గాలి తోడవటంతో మరింతగా 20 మీటర్ల ఎత్తున మంటలు రేగాయి. దట్టమైన పొగ చుట్టుముట్టడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే పాకలు, గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదంలో వృద్ధురాలు కె.రమాదేవి (68) సజీవ దహనమైంది. అత్యధిక మంది వంటకు కట్టెల పొయ్యినే వినియోగించుకుంటున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం తెల్సిన వెంటనే కలెక్టర్ బాబు ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ , మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు జలీల్‌ఖాన్ తదితరులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

చిత్రం... దగ్ధమవుతున్న గుడిసెలు