రాష్ట్రీయం

జికా వైరస్‌కు ఇదిగో వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దోమవల్ల వ్యాప్తిచెందే ప్రమాదకర జికా వైరస్ నిరోధించేందుకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సిఎండి ఎల్లా కృష్ణ తెలిపారు. జికా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శిశువుల వైకల్యానికి ఈ వైరస్ కారణమయ్యే ప్రమాదం ఉంది. ఏడాది క్రితంనుంచి వ్యాక్సిన్ తయారు చేసేందుకు తమ సంస్థలోని శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేశారన్నారు. ప్రపంచంలోనే జికా వైరస్‌పై పోరాడేందుకు తొలిసారిగా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత తమ సంస్థకు దక్కుతుందన్నారు. దీన్ని జికావాక్‌గా నామకరణం చేశామన్నారు. రెండు రకాల వ్యాక్సిన్లు తయారు చేశామని, పేటెంట్ కోసం దరఖాస్తు చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో జికా వైరస్ ప్రబలిందని వివరించారు. బ్రెజిల్‌లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందన్నారు. ఏడెస్ దోమ కాటుతో వ్యాప్తిచెందే జికా వైరస్ వ్యాక్సిన్‌కు వీలైనంత త్వరలో అనుమతి లభించవచ్చన్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ఆర్ అండ్ డి డైరెక్టర్ డాక్టర్ సుమతి విశేష పరిశోధనలు చేశారన్నారు.