రాష్ట్రీయం

పిఓఎస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల పంపిణీ ఫకడ్బందీగా, అక్రమాలకు అవకాశం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీకి సంబంధించి సంబంధిత జిల్లా అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలోని 6656 రిటైల్ దుకాణాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని దుకాణాల్లో కూడా పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) మిషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎరువుల కోసం వచ్చే రైతులు తప్పని సరిగా ఆధార్ కార్డులు తీసుకురావలసి ఉంటుందన్నారు. ఈ విషయంలో వ్యవసాయ అధికారులు, డీలర్లు, వ్యాపారులు రైతులను చైతన్యం చేయాలన్నారు. ఆధార్ కార్డు లేని రైతులు తమ పేర్లను ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాలన్నారు. ఒక జిల్లాకు కేటాయించిన ఎరువులను ఇతర జిల్లాలకు సరఫరా చేయవద్దని, ఎవరైనా ఈ విధంగా సరఫరా చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.