రాష్ట్రీయం

పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏలూరుకు చెందిన గుంటుపల్లి డాక్టర్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. పరీక్ష నిర్వహించే గదుల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాస్ కాపీయింగ్‌ను నిరోధించడంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కోరింది. మాస్ కాపీయింగ్ వల్ల విద్యా ప్రమాణాలు పతనమవుతాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ఏడాది విద్యార్థి పరీక్ష తప్పినంత మాత్రాన నష్టమేమీ ఉండదని, విద్యా ప్రమాణాలను కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు మాత్రం కఠినంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.