రాష్ట్రీయం

సర్వజనులకూ దర్శన భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 11: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారని, అందరికి ఆ స్వామి భాగ్యం కలగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పరపతి కలిగిన వ్యక్తుల కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగరాదని టీటీడీ కూడా ఆదిశగా ఆలోచిస్తుండటం సంతోషకరమని ఆయన అన్నారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం శ్రీవారిని దర్శించుకున్న ఎం.వెంకయ్యనాయుడు ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ తాను అరుదుగా తిరుమలకువస్తూ ఉంటానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భక్తులందరికి స్వామి దర్శనం కలగాలన్నది తన అభిప్రాయమన్నారు. దేవస్థానం కూడా ఆదిశగా ఆలోచిస్తోందని అన్నారు. ఎందుకంటే పలుకుబడి కలిగిన వారే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూవుంటే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగ కూడదన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తనకు తెలిపారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారందరికి దర్శన భాగ్యం కలిగేలా ఉండాలన్నారు. ఉప రాష్టప్రతిగా ఎన్నికైన తర్వాత తిరుమలకు వచ్చానని, అటు తరువాత బాధ్యతలు స్వీకరించి, స్వామి ఆశీస్సులు పొందడానికి కుటుంబ సమేతంగా వచ్చానన్నారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు తమ గ్రామం అంతా కలిసి 60 మంది ఒకసారి, 120 మంది ఒకసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నామని గుర్తు చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ తిరుమల ఎంతో అభివృద్ధి చెందిందని, అయినప్పటికి ఆనాటి ఆధ్యాత్మిక వాతావరణం, స్వామివారి ఆకర్షణ చెప్పనలవికానిదన్నారు. శ్రీవారి దర్శనంతో పొందే తన్మయత్వాన్ని మాటల్లో చెప్పలేనన్నారు. ప్రపంచ మంతా భారత దేశ ఆధ్యాత్మిక చింతనవైపు చూస్తోందన్నారు. అందుకు కారణం భారతీయ జీవనంలో, తత్వ చింతనలో సుఖం, శాంతి, సంతోషం అంతకన్నా మించి ఆధ్యాత్మిక భావన ఉందని అన్నారు. వీటి వల్ల స్వాంతన కలుగుతోందన్నారు. భారతదేశ ప్రజలకు ఉప రాష్టప్రతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తనకు దర్శన ఏర్పాట్లు చేసి స్వాగతం పలికిన టీటీడీ అధికారులకు, అర్చకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, సీవీ ఎస్వో ఆకె రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
హిందుత్వం మతం కాదు.. జీవన విధానం
హిందుత్వాన్ని మతంలా కాకుండా, జీవన విధానంగా చూడాలని రామానుజాచార్యులు, వివేకానందుడు లాంటి మహనీయులు చేసిన బోధనలను నేడు మనం అనుసరించాలని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పురాణాల్లో చెప్పినట్లుగా ఆకలి,అవినీతిలేని రాజ్యంగా భారత్ విరాజిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తిరుమలకు వచ్చిన ఆయన స్వామి దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. తమకు చేతనైతే సాయం అందించాలని బోధించేదే హిందుత్వమన్నారు. సమాజంలో అన్ని రకాల వివక్షలనూ పక్కన పెట్టి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి అందరూ పాటుపడాలన్నారు. ‘వసుధైక కుటుంబం’ అని మన పూర్వీకులు చెప్పిన మాటలను అనుక్షణం గుర్తుపెట్టుకోవాలన్నారు. మన గొప్పతనాన్ని పరిమితం చేయకుండా కార్యాచరణలో చూపించినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులకు సేవలందించడానికి టీటీడీ గొప్పగా పనిచేస్తోందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను కల్పించుకుని ముందుకు సాగాలన్నారు. స్వామికి సమర్పించే కానుకలు, విరాళాలను సక్రమంగా వినియోగించినపుడే భక్తుల విశ్వాసాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా భారత్ విరాజిల్లుతోందని, అందుకే విదేశీయులు మనదేశం వైపు చూస్తున్నారని వెంకయ్య చెప్పారు. రానున్న మకర సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉప రాష్టప్రతిగా ఎన్నికైన తరువాత మరింత పట్టుదలతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు తమ ఇలవేల్పు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు ఆయన వివరించారు.
వెంకయ్యకు నెల్లూరులో ఘనస్వాగతం
నెల్లూరు: భారతదేశ ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఆరు రోజుల ప్రత్యేక పర్యటన నిమిత్తం గురువారం నెల్లూరుకు విచ్చేశారు. నగరంలోని పోలీస్ కవాతు మైదానానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ఘనస్వాగతం పలికారు. టెక్కేమిట్టలో ఉన్న జపాన్ హౌస్‌ను సందర్శించి అనంతరం నగరంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. మంత్రులిద్దరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు జిల్లాకు చెందిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం అక్కడ్నుంచి వెంకటాచలం మండల కేంద్రంలో ఉన్న స్వర్ణ్భారత్ ట్రస్ట్ వద్దకు ఉపరాష్టప్రతి చేరుకున్నారు

చిత్రం..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి
వెళ్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు