రాష్ట్రీయం

22 నుంచి ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిసారిగా గ్రూప్-1 వౌఖిక పరీక్షలను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరాతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటికే హైదరాబాద్ నుండి తరలివచ్చిన ఏపీపీఎస్సీ అన్ని విభాగాలకు సంబంధించిన పరీక్షలను ఇక నుంచి ఏపీ కేంద్రంగానే నిర్వహిస్తామని గతంలో ప్రకటించి దానికి అనుగుణంగా అవరమైన ఏర్పాట్లలో నిమగ్నమైయింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ, దీనిలోభాగంగా 2011లో ఇచ్చిన లిమిటెడ్ జనరల్ సర్వీసుల నోటిఫికేషన్లకు సంబంధించిన 152 పోస్టులకు గాను వౌఖిక పరీక్షలను అమరావతి కేంద్రంగా విజయవాడలో నిర్వహించనుంది. జనవరి 22న గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే ఎంపికైన 152 మంది అభ్యర్థులకు వౌఖిక పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకుగాను ఏపీపీఎస్సీ 18 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోర్డు సభ్యులు ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.