రాష్ట్రీయం

ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ లోటు భర్తీ సంగతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ లోటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని పిఏసి చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు ఉందని చంద్రబాబు అంటున్నారని, కాగ్ మాత్రం రూ. 24వేల కోట్ల లోటు ఉందంటోందన్నారు. కేంద్రమేమో రూ.4వేల కోట్ల లోటు ఉందని, తమ వాటా కింద లోటును భర్తీ చేసేందుకు రూ.139 కోట్లు ఇస్తే సరిపోతుందని చెబుతున్నారన్నారు. రెవెన్యూలోటుపై గందరగోళ ప్రకటనలకు స్వస్తి చెప్పాలన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రం రుణం రూ. 90 వేల కోట్ల ఉంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.1.20 లక్షల కోట్లకు రుణం పెరిగిందన్నారు. తలసరి అప్పును కూడా పెంచారన్నారు. విచ్చలవిడిగా ఖర్చులు, దుబారాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడే స్థితికి వచ్చిందన్నారు. ఏపి భవన్ ఉండగా, తాజ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగడమేంటన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని వత్తిడి చేయడం మినహా కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఏమీ తీసుకురాలేదన్నారు. రాజధాని నిర్మాణ వ్యయం రూ.58 వేల కోట్లకు పెరిగిందన్నారు. గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు.