రాష్ట్రీయం

వ్యర్థ పదార్థాల శుద్ధికి జపాన్‌తో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పెట్టుబడుల సేకరణ లక్ష్యంతో జపాన్‌లో మూడు రోజులుగా పర్యటిస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె తారక రామారావు శుక్రవారం మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.
క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో సంస్థతో వ్యర్థ, ఘన పదార్థాల సేకరణ, శుద్ధిపై ఒప్పందం చేసుకున్నారు. ఈ అంశంలో టోక్యో క్లీన్ అథారిటీ తెలంగాణ ప్రభుత్వంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి కూడా అంగీకరించినట్టు పేర్కొన్నారు. అలాగే ఐఎస్‌ఇ ఫుడ్స్ సంస్థతో గుడ్డు ఉత్పత్తిలో తెలంగాణతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని పంచుకోవాల్సిందిగా మంత్రి కెటిఆర్ లేఖను అందజేశారు. దీని కోసం తెలంగాణలో పైలట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్టు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం..జపాన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం