రాష్ట్రీయం

‘అగ్ని’ రూపకల్పనలో హైదరాబాద్ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: భారత సైనిక దళాలకు రూపొందించిన దేశీయ క్షిపణి ‘అగ్ని-5’ రూపకల్పన వెనుక హైదరాబాద్ మద్దతు ఎంతో ఉందని కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందులో ఉన్న చిన్న ఉపకరణాలు చాలా వరకూ హైదరాబాద్‌లోనే తయారయ్యాయని చెప్పారు. మిశ్రమాలు తయారీ సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గత పాతికేళ్లుగా మిశ్రమాల తయారీ సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమలకు ఆదరణ పెరిగిందని అన్నారు. రక్షణ రంగం, వైమానిక రంగం, నిర్మాణ రంగం కోసం అవసరమైన ఉపకరణాలు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. ఇన్నోవేటివ్ మానుఫాక్చరింగ్ ఇనిస్టిట్యూట్‌లు చాలా ఏర్పా టు చేసుకుని పరిశ్రమలు వినూత్న ఉత్పత్తులను తయారుచేయాల్సి ఉందని అన్నారు. ఇతర దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి పరిశ్రమలు ఎదగాలని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు పరిశ్రమల రంగం చిన్నాభిన్నమైపోయిందని, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఆందోళనలో పడ్డారని అన్నారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారి ఆందోళనలను పటాపంచలు చేశామని అన్నారు. చిన్న రాష్టమ్రే అయినా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు ఇదే తెలంగాణ సాధించిన విజయమేనని చెప్పారు. ఇందిరాపార్కు వద్ద కూడా పారిశ్రామికవేత్తలు ఆందోళనకు అప్పట్లో దిగారని, రాష్ట్రం విడిపోతే అంధకారమవుతుందని కొంత మంది ప్రచారం చేశారని, ఆ ప్రచారాలను పటాపంచలు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రణాళికాబద్దంగా ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టారని చెప్పారు. టిఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసాన్ని నింపారని, వ్యవసాయానికి పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. కాంపోజిట్ పరిశ్రమల పాత్ర చాలా గొప్పగా ఉందని, ప్రపంచంతోనే పోటీ పడుతున్న పరిశ్రమ ఇదని అన్నారు. హైదరాబాద్‌లో వెయ్యి చిన్న పరిశ్రమలు ఉన్నాయని, ఇప్పటికే ఈ పరిశ్రమకు 123 ఎకరాల స్థలాన్ని ఇబ్రహీంపట్నం వద్ద ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. అయితే పరిశ్రమలు నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున రాయితీలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహారెడ్డి మాట్లాడుతూ 123 ఎకరాలు కాంపోజిట్ క్లస్టర్‌కు కేటాయించడమేగాక, కేంద్రప్రభుత్వం రాయితీలకు మించి తెలంగాణ ప్రభుత్వం అదనంగా రాయితీలు ఇచ్చి అభివృద్ధి చేస్తోందని అన్నారు. 14 ముఖ్యమైన పరిశ్రమలను గుర్తించి మద్దతు ఇస్తున్నామని, ప్రతి అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. హెచ్‌సియు మాజీ విసి ప్రొఫెసర్ కోట హరినారాయణ మాట్లాడుతూ ఏవియేషన్ రంగంలో ఇండియా ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోందని అన్నారు.