రాష్ట్రీయం

వస్తోంది.. సకల జనుల ఫ్రంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ‘ ఢీ’ కొట్టేందుకు బలమైన కూటమిని ఏర్పాటు చేయలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కాంగ్రెస్, బిజెపి, టి.టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, మళ్లీ టిఆర్‌ఎస్ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ‘కూటమి’ ఏర్పాటు చేయాలని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. కోదండరామ్ కూడా పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇంకా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో కొన్ని సీట్లలో అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికల వరకు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా చెప్పలేం. ప్రజా గాయకుడు గద్దర్‌కు పార్టీ పెట్టాలన్న ఆలోచన లేకపోయినప్పటికీ, ప్రొఫెసర్ కోదండరామ్‌కు మద్దతుగా ఉంటారు.
ఇలా ఇన్ని పార్టీలు పోటీ పడితే చివరకు టిఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయి ఆ పార్టీ లాభపడే అవకాశం ఉందని టి.జెఎసి, సిపిఐ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి ఇప్పటి నుంచి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, శక్తులను, సంఘాలను కలుపుకుని ముందుకు నడవాలని కోదండరామ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే టిడిపి-బిజెపి ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్నందున ఆ పార్టీలను జత కట్టుకోలేమన్న భావన ఉంది. పైగా ఆ రెండు పార్టీల మధ్య చాలా కాలంగా దూరం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా? అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. ఆ రెండు పార్టీల మధ్య మిత్రభేదం ఏర్పడితే, టిడిపిని కలుపుకుని పోవచ్చన్న ఆలోచన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో కోదండరామ్ ‘కూటమి’ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇదివరకే బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో కోదండరామ్, గద్దర్ మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇలాఉండగా కోదండరామ్ శుక్రవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం (మఖ్దూం భవన్)లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ చర్చల్లో సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.
తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తులో కూటమి ఏర్పాటు చేయడంపైనే వారి చర్చ సాగింది. టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, శక్తులను, వివిధ ప్రజా సంఘాలనూ కలుపుకుని వెళ్ళడంపై చర్చ జరిగింది. తెలంగాణ ఏర్పాటైనా కూడా టిడిపిని తెలంగాణ ప్రజలు ఆదరించి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం సామాన్యమైన విషయమేమీ కాదని వారు భావించారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో డజను మంది టిఆర్‌ఎస్ తీర్థం
పుచ్చుకోగా, ఒక ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇంకా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆర్.కృష్ణయ్య పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉన్నారని, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటారానోన్న చర్చ జరిగింది. టిడిపి నుంచి ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి ఫిరాయించినా, పార్టీ కార్యకర్తలు బలంగా నిలబడ్డారని వారు భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి 7 నుంచి 10 శాతం ఓట్లు ఉండే అవకాశం ఉందని అంచనా. కాబట్టి టిడిపి, బిజెపి వేర్వేరుగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వస్తే టిడిపిని కలుపుకుని వెళ్ళడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది. టిడిపితో కలిసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని, లోగడ వామపక్షాలు ఆ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్నాయని సురవరం సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను అగ్రభాగాన నిలిపి ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించారు. అయితే సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయిస్తే ఎలా? అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. పవన్‌తో కూడా మంతనాలు జరపవచ్చని వారు భావించినట్లు సమాచారం. ఇలా అనేక అంశాలపై వారు చర్చించారు. వివిధ పార్టీలతో కలిసి త్వరలో సకల జనుల ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

చిత్రాలు..కోదండరాం, సురవరం