రాష్ట్రీయం

ప్రకాశం జెడ్పీలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 20: జిల్లా కేంద్రంలోని శనివారం జరిగిన నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం రసాభాసగా మారింది. నువ్వెంతంటే నువ్వెంత? మర్యాదగా మాట్లాడు, ఏం నువ్వేమన్నా రౌడీవా? నీ బెదిరింపులకు భయపడేదీ లేదు? బయటకు రా తేల్చుకుందాం అంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తొలుత కావలి కాలువకు 500క్యూసెక్కుల నీరివ్వాలని సాగునీటి అధికారులను నిలదీశారు. అధికారులు రైతుల పట్ల, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల సాగునీటి పంపిణి విషయంలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి అధికారులపై ఆరోపణలు చేసి వారిపై జులుం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రతిపక్ష సభ్యులు అధికారులను పదే పదే టిడిపి కుక్కలు, వారి కార్యాలయాల్లోనే పడుకోండి అంటూ అశ్లీల పదజాలం వాడి తిడుతూ, బెదిరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీటిని అడిగితే తప్పేమిటి రైతులు బాధపడుతుంటే చూస్తూ ఊరోకోవాలా అంటూ ఎమ్మెల్యేలు కాకాణి, ప్రతాప్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో ఎవరిని కించపరచే వ్యాఖ్యానాలు చేయలేదని రైతులతో కలసి బయట వారి ఆక్రోశాన్ని వెల్లడించటం కూడా తప్పేనా? అంటూ వాదించారు. అనంతరం అధికార ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మాణాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని, అవకతవకలపై క్షేత్రస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లు నిర్మాణ వ్యయాన్ని మరో పదివేలు పెంచాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి సూచించారు. కట్టుకోని వారికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రక్షిత మంచినీటి, సాగునీటి పంపిణీ విషయంలో అధికారులు జాప్యాన్ని నివారించి సకాలంలో పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం పనితీరు బాగాలేదని పలు ఆరోపణలు చేశారు. పదేపదే ఆరోపణలు చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావని ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.