రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలో చట్ట విరుద్ధంగా పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులైన ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ లాభదాయక పదవుల్లో ఉండడం చట్ట విరుద్ధం అని వారు చెప్పారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 15 శాతం మాత్రమే క్యాబినెట్ హోదా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలను నియమించడం చట్ట విరుద్ధమని ఆయన విమర్శించారు. లోగడ హైకోర్టు చెప్పిన దానికి భిన్నంగా 21 మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ లాభదాయక పదవుల్లో నియమించి కోర్టు తీర్పును ఉల్లంఘించారని వారు తెలిపారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, కోవలక్ష్మి, ప్రశాంత్ రెడ్డి, జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్, గ్యాదరి కిషోర్‌లపై ఇసికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళతామని వారు తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ