రాష్ట్రీయం

వర్మ ‘జీఎస్‌టీ’ సినిమాపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్‌వర్మ తాజాగా తీసిన ‘గాడ్, సెక్స్, ట్రూత్ -జిఎస్‌టి’ లఘు చిత్రంపై తీవ్ర దుమారం చెలరేగింది. పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో తీసిన ఈ చిత్రం మహిళలను కించపర్చేవిధంగా ఉందని విమర్శలు వచ్చాయి. శుక్రవారం ఆన్‌లైన్‌లో జిఎస్‌టి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేపధ్యంలో సామాజిక కార్యకర్త దేవి, రామ్‌గోపాల్‌వర్మల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది. తనను కించపరుస్తూ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కాగా జిఎస్‌టి పేరుతో పోర్న్ స్టార్‌తో అసభ్యకర సినిమా తీయడం ఏమిటని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇదిలావుంటే మరో వైపు ఈ చిత్రం తీసిన కథ తనదేనని, తనకు చెప్పకుండా లఘు చిత్రం నిర్మించారని పేర్కొంటూ జయకుమార్ అనే రచయిత హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. రచయిత జయకుమార్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాను ఎంతో పవిత్రంగా రాసుకున్న స్క్రిప్ట్‌ను వర్మ బూతుగా మార్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయకుమార్ పిటీషన్‌ను విచారించిన న్యాయస్ధానం వర్మ, నటి మియా, యూ ట్యూబ్ చానల్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో వర్మ తీసిన ప్రతి సినిమా మాదిరిగా లఘు చిత్రం కూడా వివాదంగా మారింది.