రాష్ట్రీయం

రాష్ట్రానికి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 25: ఆంధ్ర ప్రదేశ్‌కు సహకరించేందుకు ఆలీబాబా క్లౌడ్ సంస్థ ముందుకొచ్చింది. భారత్‌లో శుక్రవారం తొలి డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రెండో కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ సిఈఓ సైమన్ హూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. చంద్రబాబు కోరిన మీదట సాధ్యమైనంత త్వరలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలీబాబా క్లౌడ్ సంస్థ బృందంతో సమావేశమవ్వాలని తానెప్పటి నుంచో ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో దావోస్‌లో ఆయన భేటీ అయ్యారు. ఇప్పటివరకూ అలీబాబా క్లౌడ్ సంస్థ కేవలం ఇ-కామర్స్ రంగంలోనే దిగ్గజమని భావించానని, ఇప్పుడు సాంకేతిక రంగంలో మేటిగా రూపొందిన విషయం అర్ధం చేసుకున్నానన్నారు. భారతీయులు ఐటీలో ఎంతో బలమైన వారని, ప్రపంచంలోని ప్రతి పది మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులు ఉంటారని, ఆ నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్
వారు అవడం తమకెంతో గర్వకారణమని చెప్పారు. భారతీయులు ఇంగ్లీషు, గణితాల్లో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నారని, ఆ ప్రావీణ్యమే తమను అత్యున్నత స్థానానికి చేర్చిందని అన్నారు. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం టెలికాం రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించేలా కృషి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆ ప్రక్రియ దేశ ఐటీ రంగంలో పెను మార్పును తీసుకొచ్చిందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సియాటిల్ (అమెరికా) వదలి విదేశాల్లో తన శాఖను ప్రారంభిస్తే అది భారత్‌లోనే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్‌గేట్స్ చెప్పగా తాను ఆయనతో మాట్లాడి నాడు హైదరాబాద్‌కు తీసుకువచ్చిన వైనాన్ని ముఖ్యమంత్రి వివరించారు. కొన్ని రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని, నవ్యాంధ్రప్రదేశ్ పునాదులు నిర్మించుకోవాల్సిన కర్తవ్యాన్ని ప్రజలు ఎంతో విశ్వాసంతో తన భుజస్కంధాలపై పెట్టారని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి దార్శనిక పత్రం రూపొందించుకుని కొన్ని ఉన్నత లక్ష్యాలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడితే నేడు రెండంకెల వృద్ధిరేటు సాధించిందని, 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఐటీ, ఇంటర్‌నెట్ సమ్మిళితమైన ఐఓటీ సాంకేతిక విధానాలతో పరిపాలనను ప్రగతిబాటకు మళ్లించామని, సూక్ష్మస్థాయి నుంచి టెక్నాలజీని వినియోగించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. సాంకేతికత సహకారంతో ప్రజలకు సాధికారికత సాధించాలని సంకల్పం తీసుకున్నామని వివరించారు. తమ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్ వేగంతో అందుబాటు ధరలో ఇంటింటికి వైఫై, టీవీ, నెట్ ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మారుమూల ప్రాంతాల్లోని గృహాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందించాలనేది తమ లక్ష్యమని, ఇప్పటికి లక్షా 50వేల గృహాలకు ఈ సౌకర్యం కల్పించినట్లు, ఏడాది చివరికి కోటి గృహాలకు వైఫై సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
కరవు పరిస్థితులు ఏర్పడక ముందే భూమిలో తేమ శాతం కనుగొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, వర్షపాతం, రియల్ టైంలో పంటల పర్యవేక్షణ వంటి అన్ని విషయాల్లో తాము ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు.
వ్యవసాయానికీ సాయపడండి
వ్యవసాయాన్ని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి మరింత లాభసాటిగా రూపొందించటం తమ ఉద్దేశమని, సేద్యాన్ని అంకుర దశ నుంచి ఉత్పత్తి దశ వరకు పర్యవేక్షించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సూక్ష్మపోషకాలు, క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల తయారీని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయాలన్నది తమ ఉద్దేశమని చంద్రబాబు అన్నారు. ఈ దిశగా ఎనలిటిక్స్ రంగంలో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. ఏపీలో ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు, వాణిజ్య సంస్థల ఉత్పాదకత పెంచడంలో అలీబాబా సంస్థ మద్దతు కావాలని కోరారు. సైమన్ స్పందిస్తూ తాము చైనాలోని షాంఘైలో ఇదే తరహా సేవలు అందిస్తున్నామని అన్నారు. తాము త్వరలో బృందంతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఏఏ రంగాల్లో, ఏ మేరకు సహకారం అందించవచ్చో అధ్యయనం చేస్తామని వివరించారు. షాంఘైలో తమ సంస్థ కార్యకలాపాలను పరిశీలించడానికి చైనా రావాలని సైమన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. త్వరలో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు.
దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ-పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి.విజయ్‌కుమార్ ఉన్నారు.
అలీబాబా క్లౌడ్ సంస్థ సీఈఓ సైమన్ హూ ముఖ్యమంత్రి ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ‘మీరొక రాజకీయ నాయకుడిగా కాక శాస్తవ్రేత్తలా మాట్లాడుతూ అన్నీ వివరిస్తున్నారు. అది మమ్మిల్ని ఎంతో ఆకట్టుకుంది. రేపు మేము భారత్‌లో మా మొదటి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రెండో సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేస్తాం’ అని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. రెండో సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నకు ఈ ఏడాది చివరకు ఏర్పాటు చేస్తామని సైమన్ బదులిచ్చారు. దానికి ఏడాది చివరకు అంటే చాలా ఆలస్యమని, మరింత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సైమన్ హూను కోరారు. ‘తప్పకుండా మీరు కోరిన విధంగా త్వరలో రెండో డేటా సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం’ అని సైమన్ హూ ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ సంస్థ భారత్‌లో క్రమంగా వ్యాపారాన్ని విస్తరిస్తోందని చెప్పారు. తాము ఇ-కామర్స్ డేటా ఆధారిత ఇన్‌టోన్ కామర్స్ రంగంలో పటిష్టంగా ఉన్నామని, ఈ కామర్స్ డేటా ఆధారంగా సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారవేత్తలకు ఎలాంటి తనఖా లేకుండా రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే చైనా లాజిస్టిక్స్‌లో బలమైన శక్తిగా ఉన్నామని, రోజుకు 60 నుంచి 70 మిలియన్ల పార్శిళ్లు చేరవేస్తున్నట్లు అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు తెలిపారు.
బిగ్ డేటాతో కూడిన క్లౌడ్ టెక్నాలజీ సేవల రంగంలో కూడా తాము ప్రవేశించినట్లు, ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల ఖాతాదారులకు సేవలందిస్తున్నామని, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ తమ బలాలని తెలిపారు. ఉత్పత్తి, తయారీదారులు ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకునేందుకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తున్నదని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు సైమన్ హూ వివరించారు. సంగీతం, టీవీ, సోషల్ మీడియాల్లోకి వచ్చి వినోద ఉనికిని చాటుతున్నామని అన్నారు. తయారీ రంగంలో చైనా డేటా ఆధారిత సేవలు లాంటి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు అడుగులు వేస్తోందన్నారు.
నేడు డేటా సెంటర్ ప్రారంభం
తాము భారత్‌కు విస్తరించాలని దృఢంగా కోరుకుంటున్నట్లు, భారత్‌లో తమ మొదటి డేటా సెంటర్‌ను రేపు ప్రారంభించబోతున్నామని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో చైనాలో వలె భారత్ వ్యాపారవేత్తలకు కూడా తాము తోడ్పాటు అందిస్తామని, తమ అనుభవం భారత్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ‘మీరు ఇండియాలో సాంకేతికతకు పితామహులని, ఇ-గవర్నెన్స్ ప్రధాన పోషకులని తెలియడంతో మీమీద గౌరవం రెట్టింపు అయిందని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు ప్రశంసలతో ముంచెత్తారు.