రాష్ట్రీయం

మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 25: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ బుధవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హతుడు శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు కావడంతో రాజకీయ కక్షలే హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్య లు చేపట్టారు. హత్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్‌ను హతమారుస్తామంటూ గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరులతో పాటు అధికార పార్టీ నేతల నుండి పలుమార్లు ఫోన్‌లలో, నేరుగా హెచ్చరికలు రావడంతో హత్యోదంతం ఇపుడు సంచలనం రేపింది. బుధవారం నాడు ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి వెంట పలు కార్యక్రమాల్లో పాలొ గన్న శ్రీనివాస్ రాత్రి 10-30 గంటల
సమయంలో తన ఇంటికి చేరుకున్నారు. చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, పోలీసుల కథనం మేరకు హత్యకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి. రాత్రి 11-30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌కు గోపీ అనే అనుచరుడు ఫోన్ చేసి తనను కొందరు కొడుతున్నారని, వెంటనే తన వద్దకు రావాలని కోరాడు. అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లవద్దని భార్య లక్ష్మి వారిస్తున్నప్పటికీ వినకుండా శ్రీనివాస్ తన అనుచరుడు మాతంగి మోహన్‌తో కలిసి బైక్‌పై గాంధీనగర్ హనుమాన్ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న చింతకుంట్ల రాంబాబు, మల్లేశ్, చక్రి, శరత్, భాషపాక దుర్గయ్యలను శ్రీనివాస్ వారిస్తుండగా ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఒకప్పుడు తమతో కలిసి తిరిగిన శ్రీనివాస్ ఇపుడు జులుం చేస్తున్నాడంటూ ప్రత్యర్థి వర్గం వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయిన శ్రీనివాస్‌ను వారు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. శ్రీనివాస్ బయటకు వెళ్లిన పది నిమిషాలకే భార్య లక్ష్మి ఆయనకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు లోనై, గంటసేపు తర్వాత మళ్లీ భర్తకు ఫోన్ చేసింది. శ్రీనివాస్ అనుచరుడు కొమ్ము శంకర్ ఫోన్ ఎత్తినా ఏమీ మాట్లాడకపోవడంతో లక్ష్మి తన పిల్లలతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే నిందితుల్లో కొందరు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కంగారుపడిన లక్ష్మి తన భర్త ఎక్కడున్నాడంటూ వారిని నిలదీస్తుండగా పోలీసులు ఆమెను హత్యా స్థలానికి తీసుకువెళ్లారు. డ్రైనేజీలో శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి ఆమె బోరున విలపించింది. శ్రీనివాస్‌కు కుమార్తె లక్ష్మిప్రసన్న, కుమారుడు అమర్‌నాథ్, తల్లి ఉన్నారు.
ఎస్పీ డి.వి.శ్రీనివాస్, డిఎస్పీ సుధాకర్ ఆదేశాల మేరకు శ్రీనివాస్ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సావర్కర్ నగర్‌లోని శ్రీనివాస్ నివాసానికి స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.
శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. నిందితులు చింతకుంట్ల రాంబాబు, మాండ్ర మల్లేశ్, శరత్, మెరుగు గోపీ, కత్తుల చక్రి, మాతంగి మోహన్, భూషపాక దుర్గయ్యలు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డిఎస్పీ సుధాకర్ తెలిపారు. కాగా, తన భర్తను రాజకీయ కక్షలతో కొందరు అనుచరులే నమ్మించి హత్య చేశారని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. గొడవ జరిగిందంటూ శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మెరుగు గోపి, బైక్‌పై తీసుకెళ్లిన మాతంగి మోహన్ దాడి సమయంలో సంఘటన స్థలంలో లేకపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. బెదిరింపుల నేపధ్యంలో రక్షణ కల్పించాలంటూ గతంలో సీఎం కేసీఆర్‌ను, డీజీపీని కలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరకు తన భర్తను పొగొట్టుకోవాల్సివచ్చిందంటూ ఆమె రోదించారు.
బోరుమన్న కోమటిరెడ్డి
తన ప్రధాన అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురైనట్లు సమాచారం తెలిశాక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ రోదిస్తున్న హతుడి భార్య, పిల్లలను చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. బుధవారం పగలంతా శ్రీనివాస్ తనతో పాటు నల్లగొండ, తిప్పర్తిలలో పర్యటించాడని ఇంతలోనే హత్యకు గురవ్వడం తనను కలచివేసిందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రాజకీయ కక్షతోనే..
రాజకీయంగా తనను దెబ్బతీసే లక్ష్యంతో శ్రీనివాస్‌ను అధికార పార్టీ పొట్టన బెట్టుకుందని కోమటిరెడ్డి సోదరులు ఆరోపించారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌లో చేరాలంటూ గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరులు శ్రీనివాస్‌ను తుపాకీతో బెదిరించారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం పార్టీ మారాలంటూ శ్రీనివాస్‌ను బెదిరించారని తెలిపారు. చైర్‌పర్సన్ లక్ష్మి, శ్రీనివాస్‌లకు గన్‌మెన్లను కేటాయించాలని గతంలోనే తాము సీఎం కేసీఆర్‌ను, డీజీపీని కలిసినా స్పందించలేదన్నారు. కాగా, నల్లగొండ డీఎస్పీ సుధాకర్ రౌడీయిజాన్ని ప్రొత్సహిస్తున్నట్లు వారు ఆరోపించారు. ఈ హత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

చిత్రం..డ్రైనేజీలో శ్రీనివాస్ మృతదేహం, ఇన్‌సెట్‌లో శ్రీనివాస్ ఫైల్‌పొటో