రాష్ట్రీయం

వచ్చేవారం నుంచే బడ్జెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 26: మార్చి మొదటివారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు పూర్తవుతున్నాయన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాకు గుర్తింపు లభించిందన్నారు. దేశంలోని 137 కోట్ల మంది కుల, మతాలకు అతీతంగా కృషి చేస్తే, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో
సాగుతున్నాయన్నారు. మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయన్నారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.