రాష్ట్రీయం

స్వయంప్రతిపత్తి ఉంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 26: దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని తాను భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మత విశ్వాసాల పరిరక్షణ, ఆధ్యాత్మిక సంస్థల సంరక్షణ, హిందూత్వాన్ని కాపాడటం తదితర అంశాల్లో రాజ్యాంగపరమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని భావిస్తున్నానన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ప్రారంభమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలుచేశారు. ఐఏఎస్ అధికారులు మామూలు పదవిలో ఉన్నపుడు ప్రభుత్వ పథకాలను అమలుచేసే విధంగా పనిచేస్తుంటారని, వీరే కాగ్, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగపరమైన బాధ్యతల్లోకి వెళ్లిన తరువాత వారి అధికారాలు విశేషంగా ఉంటాయని, అటువంటి విధానాన్ని దేవాదాయ శాఖలో తీసుకురావాల్సి ఉందన్నారు. దేవాదాయ శాఖ నిష్పక్షపాతంగా భక్తులకు జవాబుదారీతనంతో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేయాల్సి వుందన్నారు. ప్రభుత్వ ప్రభావం లేకుండా స్వయంప్రతిపత్తిగా పనిచేసే విధానం ఉండాలని తాను కోరుకుంటున్నానని, లౌకిక రాజ్యాంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సివుందని, హిందూత్వాన్ని సంరక్షించుకోవాలంటే దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలన్నారు. శాఖాపరంగా తానుకూడా పలు రాజకీయ వత్తిళ్లు ఎదుర్కొంటున్నానని, లౌకికపరమైన అంశాల్లో స్వయం నిర్ణయాలు తీసుకునేందుకు ఈ శాఖకు స్వయంప్రతిపత్తి అవసరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హిందువుకాదని, ఆయన తిరుమల కొండలు మూడుంటే చాలనే విధంగా జీవో కూడా విడుదల చేశారని, భవిష్యత్తులో అటువంటివారెరైనా వచ్చి అసలు తిరుమలే ఉండాల్సిన పనిలేదని శాసనం చేసే అవకాశం కూడా ఉందని, అందుకే ఈ శాఖకు స్వయంప్రతిపత్తి ఉండాలని తాను కోరుతున్నానన్నారు. దీనిపై ప్రజలంతా తమ సూచనలు తెలియజేయాలన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సివుందని, అనంతరం ఒక సమూలమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. తిరుమలను
నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని, రద్ధీ నేపథ్యంలో రోజూ వేల మంది దర్శనం లేకుండా వెనుదిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వుందని, అటువంటి అవస్థ లేకుండా ఆధార్ ఆధారిత దర్శనం విధానాన్ని కచ్చితంగా అమల్లోకి తేవాల్సి వుందన్నారు. ఆధార్ ఆధారంగా ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నదీ తెలుసుకుని, అసలు ఇప్పటి వరకు దర్శనం చేసుకోని భక్తునికి దర్శనం చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవిధంగా సంస్కరణ తీసుకురావాలనుకుంటున్నామన్నారు. విఐపి దర్శనం కూడా ఆధార్‌తో నియంత్రించి సాధారణ భక్తులకు సాఫీగా దర్శన భాగ్యం కలిగించాలన్నారు. ఈ కొత్త విధానంపై బెంగళూరులో జరిగిన టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనే అంశంపై జరిగిన చర్చలో చెప్పానన్నారు. ఇప్పటికే డిసెంబర్ మొదటి వారం నుంచి దర్శనం టిక్కెట్‌కు ఆధార్ అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం భంగం కలగకుండా మరింత ఉన్నతంగా కందుకూరి వీరేశలింగం విద్యా సంస్థలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరంలో కందుకూరి ఏర్పాటు చేసిన హితకారిణీ సంస్థలోని ఎనిమిది విద్యా సంస్థలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తున్నామని మంత్రి పైడికొండల చెప్పారు. ఈ విలీన ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి సంబంధించి అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.