రాష్ట్రీయం

త్వరలో విద్యుత్ వాహనాల పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ విద్యుత్ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయ ని, రూ.37,938 కోట్లతో భారీ ఎత్తున విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. మణుగూరు, కొత్త గూడెంలో 5880 మెగావా ట్లు, దామరచర్లలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో ఏడవ దశ విద్యుత్ ప్లాంట్ పనులు చురుకుగా సాగుతున్నయన్నారు. ఈ ప్లాంట్ విద్యుత్ కెపాసిటీ 800 మెగావాట్లని చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలలో ఈ ప్లాంట్ విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలో విద్యుత్ వాహనాల పాలసీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. శుక్రవారం ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవం సందర్భంగా జెన్కో, ట్రాన్స్‌కో కార్యాలయంలో జెండాను ఎగురవేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చేందుకు ఏజన్సీలు వస్తాయన్నారు. విద్యుత్ వాహనదారులు రీ చార్జి చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దీనికి సంబంధించి టిఎస్‌ఇఆర్‌సి టారిఫ్ ప్రకటిస్తుందన్నారు. వినియోగదారుల్లో ప్రత్యేక కేటగిరీని కూడా ఖరా రు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 68 వరకు ఇహెచ్‌వి సబ్‌స్టేషన్లు, 400 కెవి సబ్‌స్టేషన్లు 5, 220 కెవి సబ్‌స్టేషన్లు 22, 132 కెవి సబ్‌స్టేషన్లు 41ని నిర్మించామన్నారు. 4913 సర్క్యూట్ కి.మీ టాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను గత మూడున్నరేళ్ల లో నిర్మించామన్నారు. రాష్ట్రంలో 11వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా తట్టుకుని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరించిన దార్శనికతతో కూడిన విధానాల
వల్ల విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు. 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ ఆటంకం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సౌర విద్యుత్ విధానానికి దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చిందన్నారు. తెలంగాణ అవతరించినప్పుడు సౌర విద్యుత్ 30 మెగావాట్లు ఉండేదని, ఇప్పుడు 3090 మెగావాట్లకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి నర్సింగరావు, టి జగత్ రెడ్డి, జె సూర్యప్రకాశ్, జి రాధాకృష్ణ, ఎం సచిదానందం, సిహెచ్ వెంట రాజాం, ఎస్ అశోక్ కుమార్ లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న సీఎండి ప్రభాకర రావు