రాష్ట్రీయం

దేదీప్యమానంగా మహా హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: కనుల విందుగా, రంగురంగుల విద్యుద్దీపాలంకరణ మధ్య మహాహారతి కార్యక్రమం దేదీప్యమానంగా జరిగింది. భరతమాత ఫౌండేషన్ ఆధ్వ్యరంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో మహాహారతి కార్యక్రమం కొనసాగింది. చిన్నతనం నుండి పిల్లల్లో దేశభక్తిని నేర్పాలని, దేశం కోసం స్వార్ధ రహితంగా అనేక మంది చేసిన త్యాగాలను వారికి చెప్పాలని, ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించేలా, నీతి నిజాయితీగా వ్యవహరించేలా, విలువలను పాటించేలా సత్‌ప్రవర్తనతో మెలిగేలా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలతో ప్రతి ఒక్కరూ మెలగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ రికార్డు లో నమోదు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా భరత మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2వేల మందికి పైగా అమ్మాయిలు భరతమాత వేషధారణలో పాల్గొనడంతో కార్యక్రమం కనువిందుగా మారిపోయింది.
దేశం కోసం బలిదానమైన వంద మంది మహానుభావుల చిత్రపటాలను కూడా వేదిక వద్ద ప్రదర్శించారు. భరతమాత ఫౌండేషన్‌కు చీఫ్ ప్యాట్రన్‌గా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తుండగా, ప్రధాన వక్తలుగా పరిపూర్ణానంద, బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దీపప్రజ్వలన అనంతరం పెద్ద ఎత్తున ఆకాశదీపాలను ఎగురవేశారు. కంత్రీ సా ఆధ్వర్యంలో శాండ్ ఆర్టు షో జరిగింది. నాగఫణిశర్మ ప్రవచనం, పరిపూర్ణానంద స్వామి సందేశం అనంతరం మువ్వనె్నల జండా రూపంలో టపాసులను కాల్చారు.

చిత్రం..గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద భరతమాత ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మహా హారతి ఇస్తున్న బాలికలు