రాష్ట్రీయం

మేడారం జాతరకు పోటెత్తిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటిమందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, జాతర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే భయంతో ముందస్తు మొక్కులకే భక్తులు మొగ్గుచూపుతున్నారు. నెలరోజుల నుంచి భక్తుల రాక మొదలవగా ఇప్పటికే ఇరవైలక్షల కు పైగా భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకూ వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సుమారుగా మూడులక్షలకు పైగా భక్తులు తమ ఇష్టదైవాలైన తల్లులను కొలిచి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా భక్తుల రాకతో మేడారం వనాలన్ని జనాలతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో జంపన్నవాగు ప్రాం గణం కిటకిటలాడిపోయింది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద, జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అక్కడి నుండి మేడారం గద్దెలకు చేరుకుని తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. తల్లుల దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో దర్శనం కోసం గంటలపాటు వేచి ఉండవలసి వచ్చింది. భక్తుల రద్దీ క్రమేపి పెరుగుతుండటంతో పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టారు.

చిత్రం..తెలంగాణలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద కిక్కిరిసిన జనం