రాష్ట్రీయం

గోవుల రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, జనవరి 27: ఆక్రమంగా తరలిస్తున్న గోవుల లారీలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని గోవులను పోలీసులకు అప్పగించిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుండి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్న రెండు లారీల్లో ఉన్న గోవులను శనివారం కృష్ణా జిల్లా ఎ కొండూరు మండలంలోని చీమలపాడు గ్రామంలోని రామాలయం వద్ద గోసంరక్షణసమితి సభ్యులు పట్టుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని వాటిని జి కొండూరు మండలం చెవుటూరు గోసంరక్షణ శాలకు తరలించినట్లు చెప్పారు. లారీ డ్రైవర్లు కూరంపల్లి రంగారావు, ఇస్లావత్ భగంత్‌లను ఆరెస్టు చేసినట్లు ఎస్‌ఐ జె వెంకటరమణ తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గోసంరక్షణ సమితి కార్యదర్శి బొమ్మరెడ్డి సుధాకరరెడ్డి, కౌవులూరి హేమకృష్ణ, పులిపాటి కిషోర్, న్యాయంపల్లి నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.