రాష్ట్రీయం

కస్టమ్స్ అధికారికి ‘మెరిట్’ సర్టిఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 28: ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ విభాగంలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనపరిచిన కస్టమ్స్ సూపరింటెండెంట్ నందిపాటి శ్రీనివాస్‌కు ప్రతిష్ఠాత్మకమైన ‘కస్టమ్స్ మెరిట్ సర్ట్ఫికెట్’ లభించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 33 స్మగ్లింగ్ కేసులను ఛేదించినందుకు ఏపి కస్టమ్స్ కమిషనర్ కోక సుధ ఈ పురస్కారానికి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో జరిగిన అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవంలో నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ఎ రాజేంద్రప్రసాద్, విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ చేతులమీదుగా శ్రీనివాస్ ఈ సర్ట్ఫికెట్ అందుకున్నారు. శ్రీనివాస్‌కు పురస్కారం లభించినందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల ఉద్యోగులు అభినందనలు తెలిపారు.