రాష్ట్రీయం

జగన్‌కు జనం జయహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 29: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మహా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు సోమవారం నిర్వహించిన ‘వాక్ విత్ జగనన్న’ పాదయాత్రకు జనం పోటెత్తారు. ఢిల్లీతోపాటు విదేశాల్లో కూడా జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. తాజాగా వైసీపీ నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిరాశగా ఉన్న ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. విజయవాడలో ఆ పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి జనం పోటెత్తారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి హాజరయ్యారు. కాగా..దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఏపీ భవన్ నుంచి పండిట్ రవిశంకర్ శుక్లా లేన్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్
లక్షల మందితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. జగన్ దృష్టికి తెచ్చిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా గూడూరులో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జిల్లాలోని గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి, కొఠారు రామచంద్రరావుల ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఉండి మండలం ఉండి గ్రామంలో నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో గ్రామం వరకు పాదయాత్ర చేశారు. కార్యకర్తలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ బస్టాండ్ వద్ద నుంచి జయలక్ష్మి ధియేటర్ వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యాన పాదయాత్ర భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టి కురుపాం నుంచి చినమేరంగి వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లాలో బనగానపల్లె నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు 2 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా
డోన్‌లో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్ ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేశారు. రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం గ్రామ శివారులోని రాఘసుధా నుంచి రాఘవేంద్ర వరకు పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో వైఎస్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో నందికొట్కూరు నుంచి తర్తురు వరకు పాదయాత్ర చేశారు. ఆత్మకూర్‌లో శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టర్నింగ్ నుంచి పెద్ద బజార్ మీదుగా గౌడ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
కడప పార్లమెంటు అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వాక్ విత్ జగనన్న ర్యాలీని ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిపారు. నందలూరు మండల కేంద్రంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సౌమ్యణాదస్వామి ఆలయం నుంచి నాగిరెడ్డిపల్లి మారమ్మాలయం వరకు పాదయాత్ర జరిపారు. కమలాపురంలో సంఘీభావ పాదయాత్రను ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి నిర్వహించారు. చక్రాయపేట ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, జడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ రెడ్డిలు చక్రాయపేట నాగులగుట్టపల్లి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మలమడుగులో పార్టీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిపారు.
అనంతపురంలో పార్టీ నుంచి జెడ్పీ ఆఫీసు వరకు నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్ పాల్గొన్నారు. ఉరవకొండలో ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండ నుంచి బుదగవి వరకు పాదయాత్ర జరిపారు. తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి అన్నదానం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. యాడికిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర చేశారు.

చిత్రం..విజయవాడలో వైకాపా నిర్వహించిన వాక్ విత్ జగనన్న ర్యాలీ