రాష్ట్రీయం

అగ్రస్థానంలో పాస్‌పోర్ట్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వినియోగదారులకు సేవలు అందివ్వడంలో దేశంలోనే ప్రథమ స్థానం పొందిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడు తూ, పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్‌కు జాతీయ స్థాయిలో 23 రోజుల గడువు అవుతోందని, హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ పనికి కేవలం ఐదురోజులే పడుతోందన్నారు. రీ-ఇష్యూ తాత్కా ల్ పాస్‌పోర్ట్ జారీ కేవలం 24 గంటల్లో పూర్తవుతోందన్నారు. 2016 సంవత్సరంలో 6.64 లక్షల మంది పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయగా, 6.53 లక్షల మందికి పాస్‌పోర్ట్‌లు ఇచ్చామన్నారు. అదే విధంగా 2017 సంవత్సరంలో 5.89 లక్షల మంది పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయగా, 5.87 లక్షల మందికి ఇచ్చామన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు లేకపోవడం తదితర కారణాల వల్ల మిగతావారికి ఇవ్వలేకపోయామన్నారు. 2016 కంటే 2017 లో పాస్‌పోర్ట్‌ల జారీ సంఖ్య తక్కువగా అనిపిస్తోందని, అయితే 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం విజయవాడలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఎపి ప్రజలు
విజయవాడ వెళుతున్నారన్నారు. అందువల్ల హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖస్తుల సంఖ్య తగ్గినట్టు అనిపిస్తున్నప్పటికీ, తెలంగాణలో పాస్‌పోర్టులు తీసుకున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. సాధారణ పాస్‌పోర్ట్‌కోసం 1500 రూపాయలు రుసుముగా నిర్ణయించామని, నెలరోజుల్లోగా పాస్‌పోర్ట్ వస్తుందని వివరించారు. తాత్కాల్ విధానంలో నియమావళిని సులభతరం చేశామని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తాత్కాల్ పాస్‌పోర్ట్‌కోసం గెజిటెడ్ అధికారి లేదా క్లాస్-1 అధికారి సిఫార్సు చేయాల్సి ఉండేదని, ఇప్పుడు ఈ నిబంధన తొలగించామన్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్, స్వయం ధృవీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రంతో పాటు గుర్తింపుకోసం రెండు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 12 డాక్యుమెంట్లను గుర్తించిందని తెలిపారు. వీటిలో ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల, స్థానికసంస్థల సిబ్బంది తమ గుర్తింపు కార్డు, ఎస్‌సి/ఎస్‌టి/బిసి తదితర కులాల వారు తమ కుల ధృవీకరణ పత్రం, ఆయుధాల లైసెన్స్, పింఛన్ డాక్యుమెంట్, సెల్ఫ్-పాస్‌పోర్ట్, ప్యాన్ కార్డ్, బ్యాంక్/కిసాన్/పోస్ట్ఫాస్ పాస్‌బుక్, విద్యార్థులకు విద్యాసంస్థ ఇచ్చే గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డులను భారత ప్రభుత్వం ఐడి కోసం గుర్తించిందన్నారు. వీటిలో ఏవైని రెండు డాక్యుమెంట్లను తాత్కాలిక పాస్‌పోర్ట్‌కోసం దరఖాస్తులతో పాటు జతపర్చాల్సి ఉంటుందని వివరించారు. తాత్కాలిక పాస్‌పోర్ట్ కోసం 2000 రూపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని, మూడు రోజుల్లో దీన్ని ఇస్తామన్నారు.
ఇలా ఉండగా, నార్మల్ స్కీం కింద ‘ఔట్ ఆఫ్ టర్న్’ అనే మరొక పథకాన్ని ప్రవేశపెట్టామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి తెలిపారు. స్పెషల్ క్యాటగిరీ కింద ఈ స్కీం ప్రారంభించామని, సాధారణ ఫీజు (1500) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, దీన్ని మూడు రోజుల నుండి వారం రోజుల్లోగా ఇస్తామన్నారు.
పోస్ట్ఫాసుల ద్వారా
పాస్‌పోర్ట్ దరఖాస్తులను తీసుకునేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లా కేంద్ర పోస్ట్ఫాసులను గుర్తించామని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో వరంగల్, మహబూబ్‌నగర్ పోస్ట్ఫాసుల్లో ప్రారంభించామని, 2018 ఏప్రిల్‌లోగా ఖమ్మం, నల్లగొండ, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని పోస్ట్ఫాసుల్లో కూడా పాస్‌పోర్ట్‌లను తీసుకుంటామ
న్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే పాస్‌పోర్ట్‌లు సంబంధిత శాఖలకోసం హైదరాబాద్‌లో ‘విదేశీ భవన్’ ను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు.