రాష్ట్రీయం

రేపు శ్రీవారి ఆలయం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 29: దేశంలో ఈనెల 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం లాంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం రాత్రి 10.30నిమిషాలనుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఏకాంత సేవతో స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ క్రమంలో బుధవారం జరుగనున్న పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. రూ.300 ప్రత్యేక దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు కల్పించే దివ్య దర్శనం, వృద్దులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లితండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. బుధవారం కేవలం 2 గంటలు మాత్రమే సామాన్య భక్తులకు దర్శన సౌకర్యం ఉంటుంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా మూసివేస్తారు.