రాష్ట్రీయం

ఏప్రిల్ తర్వాతే అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను ఏప్రిల్ నెల తర్వాతనే చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల వివరాలను వెల్లడిస్తామని, గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు చేరాలని ఆయన సూచించారు. ముందుగా అడ్మిషన్లను చేపట్టే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు సమగ్ర షెడ్యూలును ప్రకటిస్తామని, దానికి అనుగుణంగానే అడ్మిషన్లు జరగాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.