రాష్ట్రీయం

పాదయాత్ర మధ్యలో మోదీతో భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 30: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. పాదయాత్ర మధ్యలోనే ఆయన ప్రధానితో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న హడావుడి నేపథ్యంలో, ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తోన్న జగన్, ప్రధానిని కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆ మేరకు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఓ ఎంపీకి ఆ బాధ్యత అప్పగించినట్లు చెబుతున్నారు. పాదయాత్ర మధ్యలో అంటే ఏప్రిల్‌లో ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని ఆ మేరకు పార్టీ నాయకత్వం పీఎంఓను కోరినట్లు తెలుస్తోంది. చాలా కాలం నుంచీ బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తోన్న సదరు ఎంపీనే పీఎంఓను అపాయింట్‌మెంట్ కోరినట్లు చెబుతున్నారు.
ఒక ఎంపీ మాత్రం మోదీని జగన్ కలవడం ఖాయమని, అయితే కొందరు పాదయాత్ర ముగిసిన వెంటనే కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నప్పటికీ, ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఏప్రిల్‌లోనే కలవాలని జగన్ నిర్ణయించుకున్నారని చెప్పారు. కాగా, అప్పటిలోగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, తీసుకున్న నిర్ణయాల్లో మతలబులకు సంబంధించి డాక్యుమెంటు ఆధారాలు సేకరించి, వాటిని మోదీతో భేటీ సందర్భంగా అందచేయాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.